నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిలో బాలకృష్ణ ఒకరు. ఆ తర్వాత తారక్ అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో నందమూరి వంశాన్ని మూవీ ఇండస్ట్రీలో మరింత పవర్‌ఫుల్‌గా మారస్తున్నాడు. నందమూరి వంశం నుంచి ఎందరో హీరోలు వచ్చారు కానీ వారంతా సినిమాల్లో రాణించలేకపోయారు. బాబాయి బాలకృష్ణ, అబ్బాయి తారక్‌కి మాత్రమే ఇది సాధ్యమైంది.
నిజానికి తారక్ సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలు చూసే సినీ రంగంలోకి రావాలని అనుకున్నాడు. అయితే ఇటీవల తారక్ ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు షో లోని ఒక ఎపిసోడ్ లో మాట్లాడుతూ బాలకృష్ణ సినిమా చూస్తూ తాను కుర్చి విరగొట్టానని చెప్పుకొచ్చాడు.
ఎవరి మీలో కోటీశ్వరుడు షోలోని ఓ ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్‌కు బాలకృష్ణ సినిమా గురించి ఒక ప్రశ్న వచ్చింది. లక్స్ పాపా పాట ప్లే చేసి ఈ పాట ఏ సినిమా లోనిది అని అడిగారు. దానికి నరసింహ నాయుడు అని ఆ కంటెస్టెంట్ తేలిగ్గా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు.
తారక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… “నేను బాబాయి సినిమాలు చూస్తూ పెరిగాను. నరసింహ నాయుడు నేను చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఈ మూవీ ఊర్వశి థియేటర్లో చూసినట్లు గుర్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు వచ్చిన జోష్ కి ముందున్న సీట్ ని బలంగా తన్నాను. అలా తంతే, అది వెంటనే విరిగిపోయింది” అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది ఇప్పుడు కాదు కానీ ఆ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది.