టాలీవుడ్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయాడు. పైగా త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టడమే కాదు.. తన కెరీర్లో ఫస్ట్ టైం డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ ఘనత ఇప్పటి తరం ఎన్టీఆర్‌కు పోటీగా ఉన్న స్టార్ హీరోలలో ఎవ్వరికి లేదు. అసలు డబుల్ హ్యాట్రిక్ అనేది ఓ అరుదైన రికార్డు. ఆరు హిట్లతో కెరీర్లోనే టాప్ లేపే ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా క్రేజీ డైరెక్టర్లతో పాన్ ఇండియా ప్రాజెక్టులపై కాన్సంట్రేషన్ చేశాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లోనే ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా తర్వాత కేజీయఫ్ సీరిస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా వచ్చేసింది. సలార్ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను పట్టాలు ఎక్కిస్తాడు.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఎన్టీఆర్ స్ట్రాంగ్ లైనప్‌తోనే ఉన్నాడు. ఎన్టీఆర్ కెరీర్ 32వ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారట. ఇటీవలే వెట్రిమారన్ ఎన్టీఆర్‌ను రెండుసార్లు కలిసి ఓ స్టోరీని వినిపించాడు. ఈ కథ ఎన్టీఆర్‌కు నచ్చగా.. చిన్నా చితకా మార్పులు కూడా సూచించాడట. ఈ లోగా తారక్ రెండు సినిమాలు పూర్తి చేసేలోగా వెట్రిమారన్ ఫుల్ స్క్రిఫ్ట్‌తో రెడీగా ఉంటే ఈ సినిమా పట్టాలు ఎక్కే విషయంలో సందేహాలు అక్కర్లేదు.
ఇక వెట్రిమారన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ 33వ సినిమా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఉండే ఛాన్స్ ఉంది. బుచ్చిబాబు ఉప్పెన సినిమా పూర్తి చేసినప్పటి నుంచే ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసుకున్నాడు. ఈ కథపై చాలా కసరత్తులు కూడా చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబుతో ఎన్టీఆర్‌కు ఎంతో సాన్నిహిత్య ఉంది.
అయితే ఈ మూడు సినిమాలు పూర్తయ్యేందుకు టైం పడుతుంది కాబట్టి ఈ లోగా బుచ్చిబాబుసానా మరో ప్రాజెక్టు చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ చాలా స్ట్రాంగ్ లైనప్‌తో అది కూడా మాస్ కథలతో రచ్చ చేసేందుకు కాచుకుని ఉన్నాడు. ఇక ఫ్యాన్స్‌కు అన్ని సినిమాలు పెద్ద పండగే..!