Moviesవాహ్..మహేశ్ కోసం సెన్సేషనల్ బ్యూటీని ఫైనల్ చేసిన రాజమౌళి..సూపరో సూపర్ ..?

వాహ్..మహేశ్ కోసం సెన్సేషనల్ బ్యూటీని ఫైనల్ చేసిన రాజమౌళి..సూపరో సూపర్ ..?

ఇది నిజంగా మహేశ్ అభిమానులు పండగ చేసుకునే రోజే. మనకు తెలిసిందే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఇటీవల భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు.. అలాగే రిలీజ్ రోజు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. బాహుబలి రేంజ్ ఏమాత్రం కాదని..రాజమౌళి మొదటిసారి తడబడ్డారని..ఓ హీరోను ఎక్కువ చేసి చూపించారని..ఇంకో హీరోను తక్కువ చేసి చూపించారని..అసలు కథే లేదని..ఇలా రక రకాల కామెంట్స్ వినిపించాయి. అయినా కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..

ఇక రాజమౌళీ నెక్స్ట్ ప్రాజెక్ట్..సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కమిట్ అయ్యాడనే సంగతి తెలిసిందే. ప్రజేంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. కాగా, ఇప్పుడు అందరి కళ్ళు రాజమౌళి సినిమా ఏ హీరోయిన్ ఉందబోతుందా అని తెగ బుర్ర కి పనులు చెప్పారు. అయితే, రాజమౌళి ఎవ్వరు ఊహించని విధంగా..సూపర్ సెన్సేషనల్ బ్యూటీని లైన్లో పెట్టిన్నత్ళు తెలుస్తుంది.

యస్..తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దర్శకుడు రాజమౌళి ఐశ్వర్య రాయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూమర్ ఇదే. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏమంటే.. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా 800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, RRR, బాహుబలి కంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్.

Latest news