Moviesఅభిమాని పట్ల రష్మిక షాకింగ్ బీహేవియర్..నెట్టింట వైరల్..!!

అభిమాని పట్ల రష్మిక షాకింగ్ బీహేవియర్..నెట్టింట వైరల్..!!

రష్మిక మందన్నా.. పేరు కన్నడ బ్యూటీనే..కానీ, అమ్మడు చీర కట్టి ..నగలు పెట్టుకుని..పూలు పెట్టుకుంటే..అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తకువ టైంలోనే..టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లొకి వెళ్ళటమే కాకుండా..కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం అవకాశాలు కొట్టేసి..అక్కడ కూడా తన నటనతో అందాలాతో వాళ్ల ని ఫిదా చేసింది.

ప్రజెంట్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా షూటింగ్ ని కూడా సమాంతరంగా కవర్ చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే విజయ్ సినిమా షూటింగ్ స్పాట్ లో అమ్మడు తన అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది.

ఆమె షూట్ కంప్లీట్ చేసుకుని..కార్ బ్యాన్ లోకి వస్తుండగా అక్కడే ఉన్న ఆమె అభిమానులు..కొందరు రష్మిక తో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. రష్మిక అందరి హీరోయిన్ లా వాళ్లను దూరం పెట్టకుండా..చాలా క్యూట్ గా నవ్వుతూ..ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ క్రమం లోనే మరో అభిమాని రష్మిక తో సెఫీ అంటూ దూసుకువచ్చే ప్రయత్నంలో సెక్యూరిటీ తనని అడ్డుకునెశాడు.

దీంతో రష్మిక సెక్యూరిటి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తనని వదలమని చెప్పి..అభిమానితో సెల్ఫీ తీసుకుంది. దీంతో అతడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారైంది. రష్మిక అభిమానులతో మొదులుకున్న తీరు అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news