నందమూరి నటసింహాన్ని ఆయన అభిమానులు ఎప్పుడో 1990 టైం నుంచే జై బాలయ్య అని ముద్దుగా పిలుచుకునేవారు. బాలయ్య బయట ఫంక్షన్లకు వస్తే జై బాలయ్య.. జై జై బాలయ్య అనే నినాదం వాడి అక్కడ హోరెత్తించేవారు. అయితే 1990ల్లో వచ్చిన లారీడ్రైవర్ సినిమాలో బాలయ్యా బాలయ్యా గుండెల్లో బాలయ్యా.. జై కొట్టాలయ్యా అన్న పాట పెట్టారు. బాలయ్య – విజయశాంతిపై పెట్టిన ఈ సాంగ్ అప్పట్లో మాస్ జనాలను, బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఊపేసింది.
ఆ తర్వాత బాలయ్య ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఆయన అభిమానులు జై బాలయ్యా.. జైజై బాలయ్య అని ఓ నినాదంగా హుషారెత్తిస్తుంటారు. బాలయ్య సినిమా రోజు ఏపీ, తెలంగాణ నుంచి అమెరికాలోని థియేటర్లు కూడా ఈ నినాదంతో హోరెత్తిపోతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే బాలయ్య నటించిన డిజాస్టర్ రూలర్, సాయితేజ్ నటించిన ప్రతిరోజు పండగే సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యయి. సాయితేజ్ సినిమాలోనూ జై బాలయ్య నినాదమే హోరెత్తింది.
పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అయినా కూడా జై బాలయ్య నినాదం హోరెత్తాల్సిందే. అయితే అఖండ తర్వాత జై బాలయ్య నినాదం బాగా పాపులర్ అయిపోయింది. దీనికి తోడు అఖండలో పెట్టిన జై బాలయ్యా సాంగ్ మాస్‌కు పూనకాలు తెప్పించేసింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు జై బాలయ్య అన్నది ఇండస్ట్రీలోనూ కామన్ అయిపోయింది.
బుల్లితెర పాపులర్ షోలు, చిన్న సినిమా వాళ్లు కూడా జై బాలయ్యా అంటున్నారు. బాలయ్య పేరు ప్రస్తావన వస్తే చాలు జై బాలయ్య అనాల్సిందే. ఇక బాలయ్య కూడా అన్‌స్టాపబుల్ షోతో ఈ తరం జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు యూత్‌లో కూడా జై బాలయ్యా నినాదం మామూలుగా మార్మోగడం లేదు.
ఇక ఇప్పుడు చిన్న సినిమాల్లో బాలయ్యను భీభత్సవంగా వాడేస్తున్నారు. అంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా తమ సినిమాల వైపు ఓ లుక్కేస్తారని.. తమ సినిమాలపై కూడా కాస్త బాలయ్య, నందమూరి ఫ్యాన్స్ అటెన్షన్ ఉంటుందనే వీరి ఆశ కావచ్చు. తాజాగా వచ్చిన షికారు అనే చిన్న సినిమా కోసం బాలయ్య పేరును బాగా వాడేశారు. సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రతో బాలయ్య పేరును చెప్పిస్తూ బాగా వాడేశారు. అతడు బాలయ్యకు వీరాభిమాని.
ఇక అతడు బాలయ్య డైలాగులు చకచకా చెపుతారు. పైగా ఇదే సినిమాలో పోసాని ఎపిసోడ్ కూడా ఉంది. అతడు కూడా సినిమాలో బాలయ్య అభిమానే కావడం విశేషం. పైగా బాలయ్యను పొగుడుతూ ఓ భారీ ఫైట్ సీన్ కూడా పెట్టేశారు. రెండు గంటల పాటు ఉన్న షికారు సినిమాలో బాలయ్య రిఫరెన్సులు అడుగడుగునా ఉంటాయట. కోలీవుడ్ నటి సాయిథన్సిక ఇందులో మెయిన్ లీడ్ పోషించింది.