యస్..ఇది నిజమే. స్టార్ డైరెక్టర్ రామ్ గోపల్ వర్మ సినిమా చూసి హీరో నాని ప్యాంట్ తడిపేసుకున్నాడట. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నాచురల్ స్టార్ నాని, గురించి మనకు తెలిసిందే. మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కవేళ ఆ సినిమాలో డిజాస్టర్ అయిన..బాధ పడకుండా..మరికొన్ని కొత్త కంటెంట్ సినిమాలను ట్రై చేస్తూ వస్తున్నాడు తప్పిస్తే ..ఏ రోజు ఆయన బాధపడలేదు.
మనకు తెలిసిందే నాని కెరీర్లో గత కొంత కాలంగా సరైన్ హిట్ లేదు. దీంతో నాని టైం అయిపోయింది అనుకున్న వాళ్లకి పగిలిపోయే సమాధానం ఇచ్చింది..”శ్యామ్ సింగరాయ్”. గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ ఎమత్ పెద్ద హిట్ అయ్యిందో మనం చూసిందే. ఈసినిమా తోనే మళ్లి నాని ఫాంలోకి వచ్చాడు. ఇక అది అలా ఉంటే నాని నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళి కుట్టి నజ్రియ నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా నాని పలు ఛానెల్స్ కు ఇంటర్వు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే, నాని తన లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడేంట్ గురించి వివరించారు. RGV సినిమాల్లో శివ సినిమా అంటే ఇష్టమని చెప్పిన ఆయన..అదే RGV డైరెక్ట్ చేసిన దెయ్యం, రాత్రి సినిమాలు చూసేటప్పుడు చాలా భయం వేసేదని చెప్పుకొచ్చారు. అంతేనా, తన ఫ్యామిలీతో కలిసి దెయ్యం సినిమా చూసేటప్పుడు..ఓ సీన్ వచ్చిన్నప్పుడు భయంకరంగా సౌండ్ వస్తుందని..ఆ టైంలో భయపడి చేతిలో ఉన్న ధమ్స్ అప్ తన ప్యాంట్ పై పడి మొత్తం తడి పోయిందని..అయితే, తన ఫ్రెండ్స్ ఏమో నాని భయపడి ప్యాంట్ తడి పేసుకున్నాడని చెప్పి ఏడిపించారని చెప్పుకొచ్చారు. దీంతో కాసేపు అక్కడ ఉన్న వారు నవ్వుకున్నారు. దీంతో నాని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.