Moviesహీరో బ్రాండ్ కన్నా కృతి శెట్టి గ్లామరే ఎక్కువ..డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..?

హీరో బ్రాండ్ కన్నా కృతి శెట్టి గ్లామరే ఎక్కువ..డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..?

కన్నడ బ్యూటీ కృతి శెట్టి లెక్కలు మార్చేస్తుందా..అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇన్నాళ్లు సినీ ఇండస్ట్రీలో హీరోలే ఎక్కువ హైలెట్ అయ్యే వారు. కానీ, రాను రాను ఆ సాంప్రదాయానికి బై బై చెప్పేస్తున్నారు నేటి సినీ తారలు. ఈ మధ్య కాలంలో సినిమాలో హీరో పాత్రలకంటే కూడా హీరోయిన్స్ అందాలే ఎక్కువుగా పాపులర్ అవుతూ..సినిమా సక్సెస్ కి కారణమవుతున్నాయి. సినిమాలో తమ నటనతో..అందంతో కుర్రాళ్ళను ఫిదా చేస్తున్నారు నేటి కుర్ర బ్యూటీలు.

రాధే శ్యామ్ సినిమాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ పర్ ఫామెన్స్ కన్నా కూడా..పూజా అందాలే బాగా కలిసివచ్చాయి అన్న టాక్ వినిపించింది. ఇక ఉప్పెన సినిమా టైంలోను అంతే..వైష్ణవ్ తేజ్ నటన కన్నా కూడా..కృతి లేత అందాలే హైలెట్ గా నిలిచాయి. అలాగే బంగార్రాజు సినిమా టైంలోను తండ్రి కొడుకుల కు షాకిచ్చేలా ఉంది అంటు కృతి నటన పై పొగడతలు కురించారు జనాలు. ఇప్పుడు కృతి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రతి సినిమాకి కృతీనే కావాలంటున్నారు డైరెక్టర్ నిర్మాతలు.

అమ్మడుతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అనే ముద్ర వేసుకుంది. అమ్మడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద భారీ స్దాయిలో కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో కృతి దర్శకనిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపొయింది. ఈ క్రమంలోనే ఆమె కు ఓ స్టోరి వినిపించడానికి వెళ్లిన డైరెక్టర్ సైతం ఇదే మాటలు చెప్పుకొచ్చారట.

“ప్రస్తుతం ఇండస్ట్రీలో మీ రేంజ్ మామూలుగా లేదు. ఓ స్టార్ హీరో బ్రాండ్ ఇమేజ్ కన్నా కూడా.. మీ అందాల ప్రదర్శనే ఎక్కువుగా ఆకట్టుకుంటుంది జనాలని”..అంటూ చెప్పుకొచ్చారట. ఈ మాటలు కాస్త బయటకు లీక్ అవ్వడంతో నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..కృతి ఇలాంటి స్దానాని దక్కించుకోవడం..గొప్ప విషయమే..మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం చేస్తుందో,,?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news