Moviesఅన్‌స్టాప‌బుల్ 2 రెమ్యున‌రేష‌న్‌లో టాప్ లేపుతోన్న బాల‌య్య‌... ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే...!

అన్‌స్టాప‌బుల్ 2 రెమ్యున‌రేష‌న్‌లో టాప్ లేపుతోన్న బాల‌య్య‌… ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే…!

ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా అటు వెండితెర‌పై, ఇటు బుల్లితెర‌పై సీనియ‌ర్ హీరో.. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హ‌డావిడి మామూలుగా లేదు. వెండితెర‌పై అఖండ‌తో విశ్వ‌రూపం చూపించిన బాల‌య్య ఇప్పుడు బుల్లితెర‌పై కూడా తిరుగులేని మాస్ ఎన‌ర్జీతో మంచి సంద‌డి చేస్తున్నాడు. వెండితెర‌పై అఖండ హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య‌ను కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫామ్‌లోకి తీసుకువ‌చ్చింది. ఇప్పుడు బాల‌య్య లైన‌ప్‌లో మ‌లినేని గోపీచంద్ ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి, బోయ‌పాటి శ్రీను, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో బ‌ల‌మైన లైన‌ప్ ఉంది.

ఇక ఆహా ఓటీటీ షోలో బాల‌య్య హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో చూశాం. తెలుగు బుల్లితెర‌పై.. ప్ర‌త్యేకించి ఆహాలోనూ ఎన్నో టాక్ షోలు వ‌చ్చాయి. స‌మంత లాంటి స్టార్ హీరోయినే ఏకంగా సామ్ జామ్ షో చేసింది. అయితే అవేవి క్లిక్ కాలేదు. ఇలాంటి టైంలో మ‌ళ్లీ బాల‌య్య టాక్ షో చేస్తే ఎవ‌రైనా చూస్తారా ? అస‌లు బాల‌య్య టాక్ షోల‌కు హోస్ట్‌గా సెట్ అవుతాడా ? అని అనుమానం వ్య‌క్తం చేసిన వాళ్లే నోరు తెర‌చి చూస్తూ షాక్‌లోకి వెళ్లిపోయే రేంజ్‌లో బాల‌య్య హోస్ట్‌గా విశ్వ‌రూపం చూపించాడు.

నిజం చెప్పాలంటే తెలుగు బుల్లితెర‌పై ఓ స్టార్ హీరో ఈ రేంజ్‌లో టాక్ షోను న‌డిపించి హిట్ చేస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. ఇక ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 కూడా త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతోంది. ఆహా వాళ్లు ఈ మేర‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బాల‌య్యే స్వ‌యంగా సెకండ్ సీజ‌న్ ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు. ఫ‌స్ట్ సీజ‌న్ ఇంత పెద్ద హిట్ అయినా కూడా ఆహా వాళ్ల‌ను త‌న రెమ్యున‌రేష‌న్ పెంచ‌మ‌ని బాల‌య్య డిమాండ్ చేసింది లేద‌ట‌.

బాల‌య్య ముందు నుంచి నిర్మాత‌ల మ‌నిషి. ఆయ‌న నిర్మాత‌ల కంఫ‌ర్ట్‌బులిటీ చూసుకునే త‌న రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడే త‌ప్పా ఇష్ట‌మొచ్చిన‌ట్టు రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ పోడు. ఈ గుణం బాల‌య్య‌కు ఎన్టీఆర్ నుంచే వ‌చ్చింది. ఫ‌స్ట్ సీజ‌న్లో 10 ఎపిసోడ్ల‌కు బాల‌య్య‌కు రు 1.5 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. అయితే ఇప్పుడు దానిని ఆహా వాళ్లే రు 2.5 – 3 కోట్ల రేంజ్‌లో ఇవ్వాల‌ని డిసైడ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అంటే రెండో సీజ‌న్‌కు గాను 10 ఎపిసోడ్ల‌కు యావ‌రేజ్‌గా రు. 25 – 30 ల‌క్ష‌లు బాల‌య్య పుచ్చుకోబోతున్న‌ట్టు లెక్క‌.

ఏదేమైనా ఫ‌స్ట్ సీజ‌న్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆహా స‌బ్‌స్కైబ‌ర్లు మామూలుగా పెర‌గ‌లేదు. అందుకే ఇప్పుడు ఆహా వాళ్లు బాల‌య్య రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచార‌ట‌. సెకండ్ సీజ‌న్లో ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. చిరు – బాల‌య్య ఎపిసోడ్ అంటే ఏ రేంజ్‌లో ర‌చ్చ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య చిలిపి, కొంటె ప్ర‌శ్న‌లు.. చిరు ఆస‌క్తిక‌ర స‌మాధానాల‌తో ఈ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉండ‌బోతోంద‌ని ప్రేక్ష‌కులు ఓ అంచ‌నాకు వ‌చ్చేశారు.

ఇక ఇదే సీజ‌న్ 2కు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఓ గెస్టుగా రాబోతున్నార‌ని తెలుస్తోంది. ఈ షోకు నిజంగా ఎన్టీఆర్ వస్తే వీరిద్ద‌రి బంధంపై వ‌స్తోన్న పుకార్ల‌కు స్ట్రాంగ్‌గా చెక్ పెట్టిన‌ట్టే అవుతుంది.

Latest news