గత వారం రోజులుగా తెలుగు మీడియాలో చూసినా.. తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్‌లో చూసినా సీనియర్ నటుడు వీకే నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ సహజీవనం.. ప్రేమ, పెళ్లి అంటూ ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలపై సీనియర్ నరేష్ స్పందించిన తీరు కూడా ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసింది.. పవిత్రతో తన నాలుగో పెళ్లి అబద్ధమని ఆయన ఎక్కడా చెప్పలేదు. పెళ్లి -విడాకులు అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయని చెప్పడంతో పాటు చాలా వేదాంత ధోరణిలో నరేష్ మాట్లాడారు.
ఇక ఇటీవల వీరిద్దరు జంటగా మహాబలేశ్వరం వెళ్లి ఓ స్వామిజీని కలిసి రావడంతో వీరి పెళ్లికి అంతా సిద్ధమైందన్న ప్రచారం మరింత గట్టిగా జరుగుతోంది. అయితే వాస్తవంగా చూస్తే వీరు పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నా కొన్ని కారణాలతో పెళ్లి ఆలస్యం అయ్యేలా ఉంది. అయితే వీరిద్దరి పెళ్లి ఆలస్యం కావడానికి కొన్నికారణాలు కూడా ఉన్నాయంటున్నారు.
ముఖ్యంగా నరేష్ మళ్లీ పెళ్లి అడ్డుకునేందుకు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. రమ్య రఘుపతి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న టైంలో నరేష్‌తో ఏర్పడిన పరిచయంతో ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వయస్సులో నరేష్, రమ్య మధ్య దాదాపు 20 ఏళ్లకు పైగానే అంతరం ఉంది. ఆమె మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె.
అయితే పెళ్లయ్యాక వీరి మధ్య స్పర్థలతో తక్కువ టైంలోనే విడిపోయారు. మరోవైపు రమ్య పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిందంటూ కొందరు కేసులు పెట్టారు. ఆ టైంలో నరేష్ స్పందించి రమ్యకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని.. ఆమె చేసిన అప్పులకు తాను బాధ్యుడిని కాదని చెప్పారు. రమ్య నుంచి నరేష్‌కు ఇంకా విడాకులు రాలేదని తెలుస్తోంది. ఆమె నరేష్‌కు విడాకులు ఇవ్వాలంటే ఆమె కండీషన్లు, సెటిల్మెంట్లను నరేష్ పూర్తి చేయాల్సి ఉందని టాక్ ?
ఇక ఇటు పవిత్రా లోకేష్‌కు కూడా తన భర్త నుంచి విడాకులు రావాల్సి ఉంది. ఇటు పవిత్రకు, అటు నరేష్‌కు ఇద్దరికి విడాకులు వచ్చిన వెంటనే నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి జరిగే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరు ఇప్పటి నుంచే కలిసి మెలిసి ఉండడంతో పాటు ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు.