దిల్ రాజు..చాలా దయ గల మనిషి అంటుంటారు ఇండస్ట్రీలో ఉండే జనాలు. మరి ఆయన లో అంత జాలి గుణం ఏముందయ్యా..అంటే మాత్రం..అందరు చెప్పేది..ఒక్కటే. ఆయన బ్యానర్ లో సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు ఎవ్వరికైన ఫ్లాప్ పడితే..మాత్రం ఆయన చూడ లేరట. వెంటనే వాళ్లకు తన బ్యానర్ లొనే మరో మంచి సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చి సక్సెస్..ఇచ్చే వరకు ఊరుకోడు అంటుంటారు ఇండస్ట్రీ వర్గాలు. అంత మంచి మనకున్న మహారాజు మా దిల్ రాజు అంటూ చెప్పే జనాలు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో.
రీసెంట్ గా ఆ మాటనే నిజం చేస్తూ మరోసారి..తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకున్నారు అని తెలుస్తుంది. మనకు తెలిసిందే, దిల్ రాజు బ్యానర్ లోనే అక్కినేని వారసుడు నాగ చైతన్య “జోష్” సినిమాతో ఎంటర్ అయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా చై నటన పెద్దగా మెప్పించలేకపోయింది. కధ కూడా పెద్దగా చెప్పుకోతగ్గ స్ట్రాంగ్ కాకపోవడంతో..సినిమాలో కీ ఎలిమెంట్స్ లేకపోవడంతో..సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
అయితే, అక్కినేని వారసుడి గ్రాండ్ డెబ్యూ ఇలా ఫ్లాప్ అవ్వడం దిల్ రాజు ని బాధపెట్టిందట. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్ రాజు. మధ్యలో రెండు మూడు అవకాశాలు వచ్చినా ..దిల్ రాజుకి కధ నచ్చకపోవడంతో ..ఆ కాంబో సెట్ అవ్వలేదు. అయితే చాలా కాలం తరువాత..ఆ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. దీంతో ఈసారి ఖచ్చితంగా చైతన్య కు బ్లాక్ బస్టర్ ఇస్తా అన్న ధైర్యంతో ఉన్నాడట దిల్ రాజు. అక్కినేని ఫ్యామిలీ ఎప్పటికి మర్చిపోలేని “మనం” సినిమాను డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రమే “థ్యాంక్యూ”.
కేవలం చై ని దృష్టిలో పెట్టుకుని రాసుకొచ్చిన థ్యాంక్యూ సబ్జెక్ట్ దిల్ రాజుకు బాగా నచ్చి.. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కింసాడు రాజు గారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. జులై 8న థ్యాంక్యూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని..దిల్ రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో దిల్ రాజు అక్కినేని కల నెరవేరబోతుంది అంటూ ఇందస్ట్రీ వర్గాలు అంటున్నాయి.