Moviesఆది, సింహాద్రి, జైలవకుశ సినిమాలను మించిన సినిమా వ‌స్తోందా...!

ఆది, సింహాద్రి, జైలవకుశ సినిమాలను మించిన సినిమా వ‌స్తోందా…!

ఆది, సింహాద్రి, జైలవకుశ సినిమాలను మర్చిపోవాల్సిందే..కొరటాల ప్లాన్ అదే..! అవునట. ఈ మూడు సినిమాలలో మాత్రమే కాదు, యాక్షన్ సినిమాలుగా వచ్చిన తారక్ సినిమాలన్ని మర్చిపోయేలా కొరటాల శివ తారక్ కోసం భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎన్.టి.ఆర్ 30 కథను రెడీ చేసినట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడే అందరికీ ఓ అవగాహన వచ్చేసింది. మిర్చి సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే.

 

 

అంతేకాదు, కొరటాల గత చిత్రాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ సినిమాలలోనూ భారీ ఫైట్స్ ఉంటాయి. ఆయా సినిమాలకు అవి ఎంత హైలెట్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎన్.టి.ఆర్ కెరీర్‌లో భారీ యాక్షన్ సినిమాగా వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది.

అమ్మతోడు అడ్డంగా నరికేస్తా..వంటి డైలాగులతో పాటు తొడకొడితే, గాల్లో సుమోలు లేచే సన్నివేశాలు ఇప్పటికీ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా ఓ సంచలనం. నిర్మాత దాదాపు నెలరోజులు లాభాలను లెక్కపెట్టుకున్నారు. అంతగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. జైలవకుశ..కూడా తారక్‌కు ఓ కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో జై పాత్ర సినిమాకే హైలెట్. ఇలాంటి ఒక్క తారక్ మాత్రమే చేయగలడని ఇండస్ట్రీ మొత్తం ఎంతో గూపగా చెప్పుకుంది.

ఇప్పుడు వీటన్నిటిని మించి ఎన్.టి.ఆర్ 30లో తారక్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల శివ. అంతేకాదు, ఈ సినిమాలో తారక్ ఇంట్రడక్షన్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని వీటికోసం కొరటాల ఎంతో ప్రత్యేకంగా సన్నివేశాలను రాశారని చెబుతున్నారు. తారక్ ఈ సీన్స్‌లో ఎప్పుడెప్పుడు నటించాలా అనే ఆతృతతో ఉన్నారట. మరి తారక్ – కొరటాల ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్ఠిస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news