సినీ ఇండస్ట్రీలో వరుసగా అందరు హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రానా, నితిన్, నిఖిల్, ఆది పినిశెట్టి ఇలా అందరు హీరోలు వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలను ఇంట్లో ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకుని రేపో మాపో గుడ్ న్యూస్ చెప్పే స్టేజీలో ఉన్నారు. మరో పక్క బాలీవుడ్ బ్యూటీస్, అలియా, కత్రినా కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్, విక్కిలను పెళ్ళి చేసుకుని,,ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, తాజా గా ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ హీరో రామ్ పోతినేను యాడ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. యస్..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..హీరో రామ్ త్వరలోనే తన జాన్ జిగిడి ఫ్రెండ్ మెడలో మూడు మూళ్లు వేయనున్నారట. ప్రజెంట్ తమిళ దర్శకుడు లింగుస్వామీ డైరెక్షన్ లో “ది వారియర్” మూవీ చేసిన రామ్..ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. ఆ తరువాత వెంటనే బోయపాతి సినిమా షూటింగ్ పనుల్లో బిజీ కానున్నాడు. అయితే, బోయపాటి సినిమా కు కొంచెం గ్యాపంతీసుకుని రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడట.
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఎనర్జెటిక్ హీరో రామ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తన చిన్నప్పటి క్లాస్ మేట్ నే ప్రేమించిన రామ్ మొత్తానికి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారట.
ఎంగేజ్‌మెంట్ ఆగస్టు నెలలో శ్రావణమాసంలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి మాత్రం నవంబర్‌లో కార్తీక మాసంలో జరగనున్నట్టు సమాచారం. ఇద్దరి పేర్లపై ముహుర్తం కూడా నిర్ణయమైనట్టు టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ వార్తల విన్న రామ్ ఫ్రెండ్స్ ను అడగ్గా..ఆయన ఇవి ఫేక్ అంటూ కొట్టిపారేశారట. పెళ్ళి విషయం ఏదీన ఉంటే స్వయంగా నేనే చెప్తాను..ఇలాంటివి నమ్మదు అంటూ చెప్పుకొచ్చారట. దీంతో హీరో రామ్ పెళ్ళంటూ ఆశపడిన అభిమానులకు నిరాశే మిగిలింది.