టాలీవుడ్‌లో ఉప్పుడున్న దర్శకుల్లో టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకున్నాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా స్టార్ హీరోయిన్స్‌తో చేసిన ప్రయోగం అందరినీ మెప్పించింది. ఈ సినిమాతోనే తెలుగు పరిశ్రమలో అందరి దృష్ఠిని ఆకర్షించాడు.
ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే, బాలనటుడు తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ జాంబిరెడ్డి సినిమాను తీసి మళ్ళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. వరుసగా మూడు సినిమాలు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్‌కు దూరంగా ఉంటాయి. మాస్ ఆడియన్స్ థియేటర్స్‌కు రావాలి అనే మాస్ ఫార్ములా వెంటపడకుండా హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో అదే తరహా కథలతో సినిమాలు తీసి సత్తా చాటాడు. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమా తీసి మెప్పించడం అంటే అది కూడా ఇంత చిన్న ఏజ్‌లో చాలా కష్టం.
కానీ, ప్రశాంత్ వర్మ మూస ధోరణిలో సాగడం లేదు. ఇప్పుడు కూడా హను మాన్ అనే హై టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్న సినిమాను అదే చిన్న హీరో తేజ సజ్జాను పెట్టి ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నాడు. ఇప్పటికే, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో సినిమాపై బాగానే అంచనాలు పెంచాడు. అయితే, ఆహా కోసం బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షోకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఓ టాక్ షో కోసమే బాలయ్యను కొత్తగా చూపించాలని చాలా తాపత్రయపడ్డాడు. అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులందరూ మెచ్చేలా నట సింహాన్ని చూపించి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ టాక్ షో ప్రోమో కట్ కోసమే చాలా హార్డ్ వర్క్ చేసి బాలయ్య నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు, తన టాలెంట్‌కు మెచ్చి మంచి కథ రెడీ చేసుకో..మన సినిమా చేద్దామని బాలయ్య మాటిచ్చారు. టాలెంట్ ఎక్కడుంటే అక్కడ బాలయ్య అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచించరు. అదే బాలయ్యలో ఉన్న గొప్ప విషయం.
అయితే, బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని ప్రశాంత్ వర్మ పక్కాగా ఉపయోగించుకోవాలని కసితో బాలయ్య కెరీర్‌లో ఉప్పటి వరకు చేయని ఓ గొప్ప కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. మరి అధికారికంగా బాలయ్య – ప్రశాంత్ వర్మల సినిమా ఎప్పుడు ప్రకటిస్తారో ..నిర్మాత ఎవరో తెలియాలంటే ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.