యస్..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే ఓ అపారమైన గౌరవం ఉంది. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ..ఇప్పుడు టాలీవుడ్ నే శాసితున్న..ఓ అగ్ర నిర్మాతుడిగా మారిపోయారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..ఇలాంటి పోజీషన్ కు రావాలంటే..దాని వెనుక ఎంతో కృషి ,పట్టుదల ఉండాలి. ఒక్కో సినిమాకు 100 కోట్లు పెట్టే..స్టామినా ఉన్న ఈ నిర్మాత..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ లిస్ట్ లో ఉన్నాడు.
అయితే, ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్య తో “ధ్యాంక్యూ” సినిమాను నిర్మించాడు. నిజానికి సినీ ఇండస్ట్రీకి నాగచైతన్య ఇంట్రడ్యూస్ అయిన జోష్ సినిమాను నిర్మించింది..దిల్ రాజే. కానీ, ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈ హీరోకి ఎలాగైన ఓ హిట్ ఇవ్వాలని ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దిల్ రాజు..ఎట్టకేలకు “ధ్యాంక్యూ” సినిమా రూపంలో హిట్ ఇవ్వాలని అనుకున్నారు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ టాక్ కూడా సినిమా హిట్ అవుతుందని చెప్పకనే చెప్పేస్తుంది. అయితే, ఇప్పుడు ఓ షాకింగ్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాను దిల్ రాజు ప్రముఖ OTT సంస్దకి ఫ్యాన్సి నెంబర్ కి అమ్మేసే ఆలోచనలో ఉన్నారట. గతంలో దిల్ రాజు నాని చిత్రం “వి ” ని ఇలాగే డైరక్ట్ ఓటీటికి ఇచ్చేసారు.
అఫ్ కోర్స్ అప్పటి పరిస్దితి వేరు.. ఇప్పుడు థియోటర్ ఓపెన్ అయ్యాయి..జనాలుకూడా బయటకు వస్తున్నారు. మరి ఇలాంటి మూమెంట్ లో దిల్ రాజు OTT కు ఎందుకు మొగ్గుచూపుతున్నారో తెలియడంలేదు. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం థాంక్యూ కనుక ఓటిటికు ఇచ్చేస్తే చైతూ కెరీర్ కి కొన్ని ఇబ్బందులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. అయినా ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.