అనసూయ తెలుగు బుల్లితెరకు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో గ్లామర్ అద్దిన మొట్టమొదటి యాంకర్. ఆ తర్వాత తెలుగులో ఎంత మంది యాంకర్లు చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని గ్లామరసం వలకబోసినా కూడా మన తెలుగులో ముందుగా యాంకర్లు కూడా ఈ రేంజ్‌లో గ్లామర్ డాల్స్‌గా చేయొచ్చు అని ఫ్రూవ్ చేసి.. సక్సెస్ అయ్యింది మాత్రం అనసూయే. సాక్షిలో న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసిన అనసూయ ఆ తర్వాత బుల్లితెర మీదకు ఎప్పుడు అయితే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు.
ఓ వైపు బుల్లితెరపై క్షణం తీరిక లేకుండా ప్రోగ్రామ్స్, ఇటు సినిమా ఈవెంట్లు.. మరోవైపు సినిమాల్లో ఐటెం సాంగులు.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ వెండితెరను కూడా ఏలేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా, పుష్ప సినిమాలో విలన్ పాత్రధారి సునీల్ భార్య దాక్షాయణిగా అదరగొడుతోంది. విన్నర్ లాంటి సినిమాలో ఐటెం సాంగ్‌కు కూడా ఆడిపాడింది. ఇటు క్రైం, థ్రిల్లర్ సినిమాలు కూడా చేస్తోంది.
అసలు అనసూయ ఇప్పుడు ఓ ఆల్‌రౌండర్ అయిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు లక్షల్లోనే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అనసూయ వ్యక్తిగతం విషయానికి వస్తే ఆమె అసుల పేరు పవిత్ర. ఆమె ఎన్‌సీసీలో జాయిన్ అయినప్పుడు ఆమె పేరును అనసూయగా మార్చుకుంది. ఏంబీయే చదువుకున్న ఆమె ముందుగా ఓ బ్యాంక్లో టెలీకాలర్‌గా నెలకు రు. 5 వేల జీతానికి పనిచేసింది.
ఆ తర్వాత ఓ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేసింది. ఆ తర్వాత సాక్షిలో న్యూస్ రీడర్‌గా చేస్తూ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె ఎన్‌సీసీలో ఉన్నప్పుడు 15 ఏళ్లకే తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో పడింది. అప్పుడు ఆమె వయస్సు 15 ఏళ్లే కావడం… అటు అనసూయ తల్లిదండ్రులు ఆమెను చాలా పద్ధతిగా పెంచడంతో ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. అనసూయ వాళ్లు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ల తండ్రి వాళ్లను ముందు నుంచి చాలా కంట్రోల్లో ఉంచుతూ పెంచారట.
తాను సుశాంక్‌ను ప్రేమించిన విషయం ముందుగా అనసూయ తల్లికి చెప్పిందట. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమె దుస్తులు అన్ని పెట్లో పెట్టేసి బయటకు విసిరి ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పారట. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తూనే ఉన్న అనసూయ సుశాంక్‌తో పెళ్లి చేసేసుకుందామని చెప్పినా కూడా పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెట్టాడట.
అలా 9 సంవత్సరాల పాటు వెయిట్ చేసి.. చివరకు ఇరువైపులా పెద్దలను ఒప్పించిన తర్వాతే అనసూయ – సుశాంక్ పెళ్లి చేసుకున్నారట. అయితే పెళ్లి చేసేటప్పుడు కూడా అనసూయ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదట. తర్వాత అనసూయ కెరీర్‌లో సెటిల్ అవ్వడం, ఆమె కెరీర్‌కు వెనక భరద్వాజ్ సహాయ సహకారాలు ఉండడంతో ఇప్పుడు వాళ్లింట్లో వాళ్లు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారట.