సాధారణంగా కండోమ్ ప్యాకెట్ రేటు రు. 15 నుంచి రు. 30 మధ్యలో ఉంటుంది. ఇంకా క్వాలిటీ కండోమ్‌లు వాడిని ప్యాకెట్ రేటు రు. 100 రేంజ్లో ఉంటుంది. ఇక రెండు రూపాయలకు కూడా కండోమ్ ఉంది. ఇక మన ప్రభుత్వాలు అయితే ఎయిడ్స్ లాంటి ప్రమాదకర వ్యాధులతో పాటు సుఖవ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రాథమిక కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉచితంగా కండోమ్‌లు అందజేస్తున్నాయి.
నిజానికి ఇవి వాడడం మొదలయ్యాకే మన దేశంలో సుఖవ్యాధులు, ఎయిడ్స్ తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉంటే ఓ దేశంలో కండోమ్ ప్యాకెట్ రేటు ఏకంగా రు. 60 వేలకు చేరిపోయింది. అసలు వింటానికే ఇది కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. ఇది నిజం.. దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశం గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
ఆ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో ఆ దేశ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. దీంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. కండోమ్ ప్యాకెట్ రేటు రు. 60 వేలు ఉంది. విచిత్రం ఏంటంటే బ్రాండెడ్ టీవీలు, ఫర్నీచర్, ఇతర నిత్యావసరాలు, విలాస వస్తువుల రేట్లు కూడా అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ రేటు కంటే తక్కువుగా ఉన్నాయి.
ఈ రేంజ్లో అక్కడ కండోమ్ ప్యాకెట్ రేట్లు పెరగడానికి మరో కారణం కూడా ఉంది. వెనిజులాలో అబార్షన్లు చట్ట విరుద్ధం. అక్కడ ఎవరైనా అబార్షన్లకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయి. అందుకే అవాంచిత గర్భధారణ రాకుండా ఉండేందుకు అక్కడ వాళ్లు ఎక్కువుగా కండోమ్‌లు వాడుతూ ఉంటారు. పైగా వెనిజులాలో వ్యభిచారం కూడా ఎక్కువే. అందుకే అక్కడ కండోమ్‌లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అంతే కాదు 2015 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా టీనేజ్ గర్భిణులున్న దేశాలలో వెనిజులా ఒకటి. పైగా ఇక్కడ అబార్షన్లపై నిషేధం ఉంది. ఈ టైంలో కండోమ్ ప్యాకెట్ రు. 60 వేలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.