Moviesఆ హీరోయిన్‌ దెబ్బ‌కు బెస్ట్ ఫ్రెండ్స్‌కు దూర‌మైన టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌...!

ఆ హీరోయిన్‌ దెబ్బ‌కు బెస్ట్ ఫ్రెండ్స్‌కు దూర‌మైన టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌…!

సినిమా రంగం అనేది ఓ రంగుల ప్ర‌పంచం.. ఈ రంగుల ప్ర‌పంచంలో చాలా మంది ఆక‌ర్ష‌ణ‌కు లోనైపోతూ ఉంటారు. ఈ ఆక‌ర్ష‌ణ‌ల మాయ‌ల పడి కెరీర్‌నే నాశ‌నం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో ఓ సీనియ‌ర్ హీరోయిన్‌.. ఓ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ధ్య ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు.. సంథింగ్ సంథింగ్‌లు న‌డుస్తున్నాయ‌న్న టాక్ ఉండ‌నే ఉంది. చివ‌ర‌కు ఆ హీరోయిన్ ఆ డైరెక్ట‌ర్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా పూర్తిగా క‌బ్జా చేసేయ‌డంతో అత‌డి ఫ్యామిలీలో కూడా గ్యాప్ వ‌చ్చింద‌న్నది ఓపెన్ సీక్రెట్‌.

ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసినా కూడా స‌ద‌రు సీనియ‌ర్ హీరోయిన్ పెళ్లికి దూరంగా ఉంటూ స‌ద‌రు డైరెక్ట‌ర్‌తోనే చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. అయితే ఆ డైరెక్ట‌ర్‌తో క‌లిసి నిర్మాత అవ‌తారం కూడా ఎత్తేసింది. ఆమె మాయ‌లో ప‌డే ఆ డైరెక్ట‌ర్ నాలుగైదేళ్ల పాటు కెరీర్‌ను గాలికి వ‌దిలేశాడు. దీంతోవ‌రుస ప్లాపుల‌తో పూర్తిగా పాతాళంలోకి వెళ్లిపోయాడు.

ఇక స‌ద‌రు హీరోయిన్ చాలా చిన్న వ‌య‌స్సులోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టి త‌క్కువ టైంలోనే స్టార్ హీరోలు అంద‌రితోనూ క‌లిసి న‌టించి ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గుతున్న‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్ కూడా చేసింది. ఫేడ‌వుట్ అయిన ముద్దుగుమ్మ‌లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మార‌తారు. కానీ ఈ అమ్మ‌డు మాత్రం స‌ద‌రు డైరెక్ట‌ర్‌ను బుట్ట‌లో వేసుకుని అత‌డితో క‌లిసి నిర్మాత‌గా మారింది.

ఈ జాయింట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇప్పుడు లాభాల్లో ఉంది. పాన్ ఇండియా లెవ‌ల్లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో ఆమె మితిమీరిన జోక్యం, కెలుకుడు కార‌ణంగా ఎప్ప‌టి నుంచో స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్‌కు స‌న్నిహితులుగా, క్లోజ్ స‌ర్కిల్స్‌లో ఉన్న వారంతా ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నార‌ట‌. త‌న బెస్ట్ ఫ్రెండ్స్‌కు కూడా ఆమె కార‌ణంగానే ఆ డైరెక్ట‌ర్ దూర‌మ‌వుతున్నాడ‌న్న ప్ర‌చారం ఉంది.

ఇంత జ‌రుగుతున్నా ఆ డైరెక్ట‌ర్ మాత్రం ఆమెపై ఉన్న మోజుతో ఆమెను కంట్రోల్ చేయ‌లేకపోతున్నాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌ట‌కీ అయినా ఆమెను కంట్ర‌ల్లో పెట్ట‌క‌పోతే స‌ద‌రు డైరెక్ట‌ర్‌కు మ‌ళ్లీ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. ఆయ‌న డౌన్ ఫాల్స్లోకి వెళ్లిపోతార‌న్న వార్నింగ్‌లు అయితే ఇండ‌స్ట్రీలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news