Newsఇంట్రెస్టింగ్ : మళ్లీ ఇండియాలోకి టిక్‌టాక్ యాప్ వచ్చేస్తుందోచ్ ..?

ఇంట్రెస్టింగ్ : మళ్లీ ఇండియాలోకి టిక్‌టాక్ యాప్ వచ్చేస్తుందోచ్ ..?

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్..గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్ అయిన అతి కొద్ది టైంలోమే ప్రపంచ దేశాలకు పాకేసిన ఓ వైరస్ లా అందరి ఫోన్ లల్లోకి ఎక్కేసింది. అంతేనా ఏకంగా ప్రపంచ నెంబర్ 1 సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ నే బీట్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ యాప 2020లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ డౌన్‌లోడ్స్ చేసుకుంది. మనకు తెలిసిందే మాయదారి మహమ్మారి కరోనా ఇండియా లో అడూగు పెట్టిన వేళ..ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో..చాలా మంది ఇంట్లో ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసి ..ఫన్నీ వీడియోస్ చేసేవారు.

కాగా, కొన్ని భద్రతా కారణాల రీత్యా..కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేసింది. కేవలం ఇండియాలోనే కాదు..ప్రపంచదేశాలల్లో చాలా దేసాలు ఈ యాప్ ని బ్యాన్ చేసాయి. ప్ర‌ముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ విష‌యంలో రోజుకో ఆసక్తిక‌ర వార్త వెలుగులోకి వ‌స్తోంది. ఇక ఈ క్రమంలోనే షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ యజమానులు ఇండియాలో కొత్త భాగస్వాముల కోసం ప్రయత్నిస్తున్నారు. భారత్‌కు చెందిన హిరనందని గ్రూప్‌ తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని ఇండియాలో టిక్‌టాక్‌ను మళ్లీ లాంచ్ చేయాలని బైట్‌డ్యాన్స్ ఆలోచిస్తోందని ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది.

అయితే.. టిక్‌టాక్ మాత్రం ఈసారి భారతీయ చట్టాలకు, మార్గదర్శకాలకు లోబడి ..మరోసారి భారత్‌లోకి స్పెషల్ ఫీచర్స్ తో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్నత్ళు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు భారత్‌లో ఉన్న వ్యాపార భాగస్వాముల కోసం టిక్‌టాక్ అన్వేషిస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. టిక్‌టాక్ మాతృ సంస్థ Bytedance ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీ బిజీ గా ఉందట. టిక్‌టాక్‌ను తిరిగి భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు హిరనందని గ్రూప్‌ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, చైనాతో చాలా కాలంగా ఉన్న సమస్యల తర్వాత.. చైనీస్‌తో నడిచే యాప్‌ను భారత్‌లో రీలాంచ్ చేయడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news