ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తోన్న న్యూస్ సీనియర్ నటుడు నరేష్.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ బంధం. వీరిద్దరు గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారన్న మాట ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఎక్కడ చూసినా వీరిద్దరు జంటగానే కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న ప్రచారం వారం రోజులుగా ఎక్కువుగా వినిపిస్తోంది.
ఇక సీనియర్ నటి విజయనిర్మల ఏకైక కుమారుడు అయిన నరేష్ 1980వ దశకంలో హీరోగా చేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. నరేష్‌కు తల్లి విజయనిర్మల నుంచి వచ్చిన కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. నరేష్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని కూడా అంటారు. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటారు. విజయనిర్మల ముందుగా ఓ అమ్మాయితో పెళ్లి చేయగా.. మనస్పర్థలతో ఆమెతో విడిపోయాడు.
ఇక అసిస్టెంట్ డైరెక్టర్ రమ్య రఘుపతిని కూడా నరేష్ పెళ్లి చేసుకుని విడిపోయాడు. ఇటీవల ఆమెకు తనకు సంబంధం లేదని నరేష్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో ఉంటున్నాడట. గత యేడాదిన్నర కాలంగా కలిసే కనిపిస్తోన్న నరేష్ – పవిత్ర మధ్య ప్రేమ ఎక్కడ చిగురించింది అంటే వీరిద్దరు కలిసి 10 సినిమాల్లో నటించారు. అయితే పవిత్రకు 2007లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన సుచేంద్ర ప్రసాద్‌తో వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తతో విబేధాలు రావడంతో ఆమె దూరంగా ఉంటోంది. అయితే పవిత్రా లోకేష్‌కు భర్త నుంచి విడాకులు రాలేదట. విడాకులు వచ్చిన వెంటనే నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరు జంటగా మహాబలేశ్వరం వెళ్లి ఓ స్వామిజీని దర్శించుకున్నారు. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
ఇక నరేష్ వయస్సు 62 ఏళ్లు కాగా.. పవిత్రా లోకేష్ వయస్సు 43. వీరిద్దరి మధ్య 19 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు తనకు తోడు ఎవ్వరూ లేకపోవడంతో నరేష్ ఈ వయస్సులో తనకు ఓ తోడు ఉంటే బాగుంటుందనే పవిత్రా లోకేష్‌ను తన భార్యను చేసుకోవాలని అనుకుంటున్నట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీళ్లిద్దరు ఒక్కటవుతారా ? లేదా ? అన్నది కాలమే ఆన్సర్ చేయాలి.