Moviesఆ యంగ్ హీరోకు అంత త‌ల‌బిరుసా.... సినిమా ప్ర‌మోష‌న్‌కు ర‌మ్మంటే అంత...

ఆ యంగ్ హీరోకు అంత త‌ల‌బిరుసా…. సినిమా ప్ర‌మోష‌న్‌కు ర‌మ్మంటే అంత మాట‌న్నాడా…!

ఏదేమైనా ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం.. ఇక్క‌డ అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కు ఒక‌లా.. అవ‌స‌రం తీరాక మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఇండ‌స్ట్రీలో కృత‌జ్ఞ‌త అన్న ప‌దానికి విలువ చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే ఇటీవ‌ల కాలంలో మ‌న హీరోల తీరు మారుతోంది. తోటి స్టార్ హీరోలు, త‌మ‌కు పోటీగా ఉన్నా కూడా వారి సినిమాల‌కు ఏదో ఒక రూపంలో ప్ర‌మోష‌న్లు చేస్తూనే ఉన్నారు.

అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇలా ఒక‌రికొక‌రు త‌మ తోటి పోటీ హీరోల సినిమాల‌పై ఏదో ఒక రూపంలో ప్ర‌శంస‌లు కురిపిస్తూనే వ‌స్తున్నారు. మ‌హేష్‌బాబు కూడా చిన్న సినిమాలు త‌న‌కు న‌చ్చితే ఎవ్వ‌రికి చెప్ప‌కుండానే త‌న‌వంతుగా ప్ర‌మోట్ చేస్తాడు. అయితే ఓ యంగ్ హీరో మాత్రం త‌న‌కు తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ కొడుకు సినిమాకు చిన్న ప్ర‌మోష‌న్ సాయం అడిగితేనే చేయ‌లేద‌ట‌.

ఆ యంగ్ హీరోకు బాగా యాట్యిట్యూడ్ ఎక్కువ అని.. తానే గొప్ప అన్న‌ట్టుగా బిహేవ్ చేస్తాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న అత‌డికి ఓ స్టార్ డైరెక్ట‌ర్ పుణ్యాన ఓ మాంచి హిట్ వ‌చ్చింది. నిజానికి ఆ సినిమాతో ఆ కుర్ర హీరోకు మాస్ ఇమేజ్ కూడా వ‌చ్చింది. అయితే స‌ద‌రు హీరో అవ‌న్నీ అప్పుడే మ‌ర్చిపోయిన‌ట్టున్నాడు.

అస‌లు విష‌యంలోకి వెళితే పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా న‌టించిన చోర్ బ‌జార్ సినిమా ఈ వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఆ సినిమా ప్ర‌మోష‌న్ కోసం పూరితో ప‌రిచ‌యం ఉన్న హీరోలు త‌మ వంతుగా సాయం చేస్తున్నారు. ప్ర‌భాస్ గ‌తంలోనే ఆకాష్ పూరితో ఓ వీడియో ఇంట్రాక్ష‌న్ ద్వారా సాయం చేశాడు. ఇప్పుడు ప్ర‌భాస్ స‌న్నిహితులు అయిన యూవీ వాళ్లు కూడా త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారంద‌రిని కూడా ఈ సినిమాకు వాడేస్తున్నారు.

ఆకాశ్ పూరి కూడా మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న సినిమాను బాగా ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. అయితే ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు ర‌మ్మ‌ని ఆకాశ్ స్వ‌యంగా ఎంతో మంది హీరోల‌ను రిక్వెస్ట్ చేస్తూ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ట‌. త‌న తండ్రి హిట్ ఇచ్చిన ఆ యంగ్ హీరోను అడిగితే తాను బిజీగా ఉన్నా రాన‌ని చెప్పేశాడ‌ట‌. దీంతో ఇప్పుడు ఈ విష‌యం మీడియా వ‌ర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది. మామూలుగానే యాట్యిట్యూడ్ చూపించే ఆ హీరో క‌నీసం త‌న‌కు హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ కొడుకు సినిమా అన్న కృత‌జ్ఞ‌త కూడా చూప‌లేద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news