ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ నెల 3న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉన్న ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు విపరీతంగా దక్కాయి.
ప్రపంచ వ్యాప్తంగా రు. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖుల ప్రశంసలు కూడా వస్తుండడంతో సినిమా ఇంకా స్టడీగానే రన్ అవుతోంది. కమల్ హాసన్ విక్రమ్ సినిమా కూడా మేజర్ రిలీజ్ అయిన రోజే పోటీగా రాకపోయి ఉంటే మేజర్ రేంజ్ మరోలా ఉండేదనే చెప్పాలి.
ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న అడవి శేష్ తన తాజా ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అడవి శేష్ ఏజ్ ఇప్పటికే మూడున్నర పదులు దాటేసింది. ఇక తనకు పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో తీవ్రమైన ఒత్తిడి ఉందని… ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి అయితే చాలు పెళ్లి చేసేసుకో అని చెపుతున్నారని చెప్పాడు. ఇక తన పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్‌ఖాన్ లాంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారని చెపుతుంటానని కూడా చెప్పాడు.
ఇక లవ్, ఎఫైర్స్ ఉన్నాయా ? అన్న ప్రశ్నకు శేష్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. సల్మాన్‌లా తనకు ఎవరితోనూ ఎఫైర్లు లేవని.. అయితే అమెరికాలో ఉన్నప్పుడు మాత్రం కాస్త ప్రేమలో దెబ్బతిన్నా అని.. నా పుట్టిన రోజు నాడే ఆమెకు పెళ్లయిపోయిందని శేష్ అన్నాడు. ఆమెకు పెళ్లయ్యి పోవడంతో నా హృదయం బద్దలైందని తన బ్రేకప్ సీక్రెట్ రివీల్ చేశాడు.
ఇంకా మేజర్ సినిమా గురించి చెపుతూ మన తెలుగోడు హిందీ వెళ్లి సాధించాడు అని అంటుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని.. ఈ ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టిందని.. చిరు, మహేష్‌కు ఎలా అభిమానులు ఉంటారో ? తాను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌ను అభిమానిని అని చెప్పారు.