టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా గెహ్నా సిప్పీ హీరోయిన్‌గా జీవన్‌రెడ్డి దర్శకుడిగా వచ్చిన చోర్ బజార్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన తండ్రి ఇతర సినిమా పనుల్లో బిజీగా ఉన్నా హీరో ఆకాశ్ పూరి ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలు అన్నీ తన భుజస్కంధాల మీద వేసుకుని మోశాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథా పరంగా చూస్తే… హైదరాబాద్ రాయల్ మమ్మీస్ మ్యూజియంలో 200 కోట్ల విలువ చేసే నిజాం వజ్రం మాయమవుతుంది. పోలీసుల దర్యాప్తు స్టార్ట్ అవుతోంది. అదే టైంలో బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) 30 నిమిషాల్లో కారు టైర్లను తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించే దొంగ. చోరికి గురైన వజ్రం చోర్ బజార్‌లో ఉందని పోలీసులకు తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది ? దానిని ఎవరు దొంగిలించారు ? పోలీసులు వాళ్లను కనుగున్నారా ? అన్న ప్రశ్నలకు ఆన్సరే ఈ సినిమా.
ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు చూస్తే ఔట్ & ఔట్ యాక్షన్ సినిమా చేసి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆకాశ్ పూరి ట్రై చేశాడు. ఈ సినిమాలో అతడు చాలా యాజ్‌తో యాక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే వాయిస్, డైలాగ్ డెలివరీలో బాగా ఇంఫ్రూవ్ అయ్యాడు. హీరోయిన్ ఓకే. అదే టైంలో ఈ సినిమాకు కథే పెద్ద మైనస్ అయ్యింది. దానికి తోడు స్క్రీన్ ప్లే పేలవంగా ఉండడంతో కథను సరైన రేంజ్‌లో చెప్పలేదు.
మిగిలిన నటులు ఉన్నా వారికి కూడా పవర్ ఫుల్ పాత్రలు ఇవ్వలేదు. ఆకాశ్ పూరి నటించినా బలమైన ఇంఫాక్ట్ అయితే చూపలేదు. ఇటు లవ్ సీన్లు, అటు యాక్షన్ సీన్లు మెస్మరైజ్ చేసే రేంజ్‌లో అయితే లేవు. ఓవరాల్‌గా సినిమాలో చాలా వరకు అర్థం లేని, అవసరం లేని సన్నివేశాలు.. కథనం మన అసహనాన్ని పరీక్షిస్తుంది. ఓవరాల్‌గా చోర్ బాజర్ అనేది సిల్లీ, బోరింగ్ డ్రామాగా అనిపిస్తుంది.