టాలీవుడ్ సినీ చరిత్రలో “చిరంజీవి” అనే పేరుకి ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. సపోర్ట్ ఉంటే కూడా నిలబడలేని ఈ టఫ్ ప్రపంచంలో..ఎటువంటి సహాయం లేకుండా..కేవలం కష్టానే నమ్ముకుని..తన టాలెంట్ తో చిన్న హీరో స్దాయి నుండి..ఇప్పుడు మెగాస్టార్ గా సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండే వరకు వచ్చారు అంటే ..అది మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంతో కష్టం..ఎన్నో సంవత్సరాల కృషి ఉంది.
అయితే, చిరంజీవి ని చూసి ఆదర్శంగా తీసుకుని..ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఆయన హెల్ప్ తో..ఆయన పేరు చెప్పుకుని టోటల్ మెగా ఫ్యామిలీ బ్రతికేస్తున్నారు. అయినా కానీ ఇప్పటికి చిరంజీవి నమ్మేది ఒక్కటే..మనలో టాలెంట్ ఉంటే..వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే..ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దానికి టైం పట్టచ్చు..కానీ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పుతుంటారు.
చిరంజీవికి చరణ్, సుస్మిత, శ్రీజ ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ వీళ్లల్లో శ్రీజ అంటే ఫస్ట్ నుండి చిరు కి చాలా గారభం అని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. అలాగే తన లైఫ్ అమ్మ, భార్యని ఎప్పటికి మర్చిపోలేనని..వాళ్ళు లేకపోతే చిరంజీవి అనే వాడే లేడు అని..పెళ్లికి ముందు అమ్మ నాకోసం ఎంత కష్టపడిందో..పెళ్ళి తరువాత నా కోసం ఫ్యామిలీనీ అంతా చూసుకుంటూ ఇంటిని మ్యానేజ్ చేసి నాకు కష్టం అనేది రాకుండా చూసుకుంది..అని చిరంజీవి అమ్మ అంజనమ్మ, భార్య సురేఖలను పొగుడుతూ..తన జీవితంలో వాళ్ళ స్దానం ఏంటో చెప్పుకొచ్చారు.