ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాలు కామన్. టాలీవుడ్లో ఓ మోస్తరు రేంజ్‌కు వెళ్లిపోయాక..కాస్త క్రేజ్ వచ్చాక హీరోలు ఇలాంటి చిలక్కొట్టుడు… కమిట్మెంట్ వ్యవహారాలకు కక్కుర్తిపడరు. వాళ్లకు వచ్చిన క్రేజ్ ఎక్కడ పోతుందో ? ఈ వ్యవహారం బయట పడితే ఎక్కడ తమ పరువు పోతుందో ? అన్న భయం వాళ్లకు ఉంటుంది. వాళ్ల తతంగాలు ఏమైనా ఉంటే అవన్నీ తెరవెనుకో లేదా ఏ బెంగళూరు, చెన్నై, ముంబైలోనే.. లేదా ఎవ్వరికి తెలియకుండా విదేశాల్లోనో జరిగిపోతూ ఉంటాయి.
ఇక సదరు కుర్ర క్రేజీ హీరోకు చాలా తక్కువ టైంలోనే మాంచి హిట్లు పడ్డాయి. యూత్‌లో అతడి స్టైల్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. పెద్ద బ్యానర్లు, దర్శకుల నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇంకేముంది తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ వచ్చిందన్న భ్రమల్లోకి వెళ్లిపోయాడు. ఇంకేముందు తన సినిమాల్లో ఎలాంటి హీరోయిన్ను తీసుకున్నా తన పక్కలోకి రావాలని రూల్స్ పెట్టడంతో పాటు కమిట్మెంట్లు అడిగేస్తున్నాడట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రీసెంట్గా సదరు హీరో సినిమా ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ హీరో సినిమాకు హీరోయిన్ను సెట్ చేయడం పెద్ద పనేం కాదు. చాలా మందే ఉన్నారు.. అవసరం అనుకుంటే ఓ కొత్త అమ్మాయిని కూడా తీసుకువస్తారు. అయితే ఇప్పటి వరకు ఆ హీరో సినిమాకు హీరోయిన్ సెట్ కాలేదని అంటున్నారు. ఇందుకు కారణం అతడి కమిట్మెంట్ బుద్ధే అని టాక్ ? రీసెంట్గా ఓ పెద్ద హిట్ కొట్టి… ఓ పెద్ద సినిమాలో ఐటెం సాంగ్ చేసిన హీరోయిన్ను ముందు అనుకున్నారు. అయితే పక్కలోకి రావాలని భేరం పెట్టడంతో ఆమె సైడ్ అయిపోయిందట.
ఇక గతంలో తనతో నటించిన హీరోయిన్నే అడిగారట. ఆల్రెడీ చేసిన హీరో… తమ కాంబినేషన్ బాగుందన్న టాక్ ఉండడంతో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. అయితే అసలు తెరవెనక కోపరేట్ చేసే విషయం తెలియడంతో తనంతట తానే తప్పుకుందట. ఈ చిలక్కొట్టుడు బాగోతాల కోసమే సదరు హీరో ఇప్పుడు స్పెషల్‌గా ఆఫీస్ కూడా తెరిచాడట.
సదరు హీరో గారి కార్యాలు అన్ని ఇక్కడే వెలగ పెడతాడని అంటున్నారు. ఎంతోమందికి.. బడా బడా వారసులకే దక్కని పాపులారిటీ సదరు హీరోకు దక్కింది. అయితే దానిని ఈ తెరవెనక తతంగాలు, కండీషన్లతో చేజేతులా నాశనం చేసుకుంటున్నాడని అంటున్నారు.