టాలీవుడ్లో ప్రతి శుక్రవారం నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజు వరకు టాప్ హీరోగా ఉన్న హీరో కావచ్చు.. సినిమా కావచ్చు రేపు శుక్రవారం మరో బ్లాక్‌బస్టర్ సినిమా వస్తే సులువుగానే గేమ్ నెంబర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరో స్టేటస్ కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మధ్య పోటీ నడిచేది. ఆ తర్వాత తరంలో చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ పోటీ పడినా.. ఫైనల్‌గా ఈ పోటీ చిరు వర్సెస్ బాలయ్య మధ్యే నడిచింది.
ఇక ఈ తరం జనరేషన్ హీరోల్లో చాలా మంది హీరోలు నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడుతున్నారు. వీరిలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సూపర్ స్టార్ మహేష్‌బాబు మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తుంది. మధ్యలో బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ రేసులోకి దూసుకు వచ్చాడు. అయితే సాహో, రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ల తర్వాత ప్రభాస్ వెనక్కు వెళ్లిపోయాడనే ఎనలిస్టులు చెపుతున్నారు.
అయితే ఇప్పుడు పోటీ ప్రధానంగా బన్నీ, మహేష్, ఎన్టీఆర్ మధ్యే నడుస్తోంది. వీరిలో కూడా బన్నీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేయడంతో ఇప్పుడు వీరిద్దరిలోనే టాప్ ర్యాంక్ వార్ నడుస్తోంది. అయితే ఇటీవల వరుసగా ఇంటర్వ్యూల ఇస్తోన్న దర్శకుడు గీతా కృష్ణ టాలీవుడ్ నెంబర్ వన్ ర్యాంకుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న హీరోల్లో జూనియరే ఎన్టీఆరే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని చెప్పారు.
గతంలో ప్రభాస్‌కు నెంబర్ వన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తాను చెప్పానని అయితే ప్రభాస్‌కు సరైన కథలు ఎంచుకునే నైపుణ్యం లేదని.. రెండు వరుస బిగ్గెస్ట్ ప్లాపులతో రేసులో వెనకపడిపోయాడని గీతాకృష్ణ చెప్పారు. ఇక ఎన్టీఆర్‌కు చిన్నప్పుడే తల్లి వేసిన భరతనాట్యం పునాదితో సకల కళావల్లభుడు అయిపోయాడని.. ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదని.. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని.. మంచి సింగర్ అని.. పైగా కథలు ఎంచుకోవడంలో కూడా అతడికి టాలెంట్ ఉందని ఆకాశానికి ఎత్తేశారు.
ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కంటే రామ్‌చరణ్ క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉందన్న అంశంపై ఆయన మాట్లాడుతూ అది కేవలం తెలుగు వరకు మెగా కాంపౌండ్ వాళ్లు చేసుకున్న సౌండ్ మాత్రమే అని.. వాస్తవంగా పాన్ ఇండియా లెవల్లోనూ, ఓవర్సీస్ ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనకే ఎక్కువ మార్కులు వేసిన విషయాన్ని సైతం ఆయన చెప్పారు.
ఇక గీతా కృష్ణ మాత్రమే కాకుండా ఇటీవల మరో స్టార్ డైరెక్టర్ కె. విశ్వనాథ్‌తో పాటు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సైతం జూనియర్ ఎన్టీఆర్ పౌరాణిక, సాంఘీక పాత్రలు అన్నింటిని అవలీలగా పోషిస్తారని మెచ్చుకోవడంతో పాటు ఇప్పుడు తరం జనరేషన్ హీరోల్లో అతడే నెంబర్ వన్ అని చెప్పారు. ఏదేమైనా ఎన్టీఆర్ నెంబర్ వన్ అని చెప్పే సినిమా సెలబ్రిటీలు రోజు రోజుకు పెరుగుతున్నారు.