టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియాగా మారుతోంది. ఇది నిజంగా గొప్ప విషయమే అయినా మన హీరోలు అందరూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాల్సిన అవసరం కూడా ఉంది. బాహుబలితో ప్రభాస్, పుష్పతో బన్నీ, త్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మాత్రమే నిజమైన పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. మరి కొందరు పాన్ ఇండియా లెవల్ సినిమాలు చేసినా వారికి ఆ స్థాయి క్రేజ్ రాలేదు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా స్టార్‌గా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి పైన చెప్పుకున్న పాన్ ఇండియా హీరోలు అందరికి బలమైన సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వాళ్లు భారీ భారీ సినిమాలు చేస్తే కాని వాళ్లకు పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సింపుల్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండకు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. సోలో హీరోగా మూడేళ్లలో మూడు వరుస హిట్లతో యూత్‌లో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. 2016లో పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ – 2017లో అర్జున్ రెడ్డి – 2018లో గీతగోవిందం సినిమాలు మూడు బ్లాక్‌బస్టర్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో టైర్ 2 సినిమాల్లో నెంబర్ వన్ ప్లేసుకు చేరుకున్నాడు. యూత్‌లో పెద్ద హీరోలకు పోటీ అయిపోయాడు.
ఆ తర్వాత మూడు సినిమాలు ట్యాక్సీవాలా కూడా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది. డియర్ కామ్రేడ్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యి అంచనాలు అందుకోకపోయినా ఆ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్… ఓపెనింగ్స్ విజయ్ స్టామినా ఏంటో చెప్పాయి. వరల్డ్ ఫేమస్ లవర్ కూడా భారీ అంచనాలతో వచ్చి భారా ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. పై ఆరు సినిమాలే విజయ్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడంతో పాటు దేశంలోనే మెస్ట్ స్టైలీష్ యాక్టర్‌ను చేశాయి.
తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమా భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైతం నిర్మాణ భాగస్వామిగా వచ్చారంటే పూరి క్రేజ్ నార్త్‌లో ఎలా ఉందో తెలుస్తోంది. లైగర్ తర్వాత వస్తోన్న జనగనమణ కూడా పాన్ ఇండియా లెవల్లో వస్తోంది. ఆ సినిమాపై కూడా సౌత్, నార్త్‌లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇది కాకుండా కరణ్ జోహార్ విజయ్‌తో ఓ బాలీవుడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాను అదే డైరెక్టర్ హిందీలో కబీర్ఖాన్గా తీశాడు. అక్కడ హీరో స్టైల్ కంటే ఇక్కడ విజయ్ స్టైలే వాళ్లకు కూడా నచ్చిందని హిందీ జనాలే ఒప్పుకున్నారు.
నిజంగా విజయ్ ఆ సినిమా రీమేక్‌లోనే బాలీవుడ్లో చేసి ఉంటే తెలుగు జనాలు షాక్ అయ్యేంత పాన్ ఇండియా క్రేజ్ ఈ పాటికే వచ్చేది. లైగర్ స్టిల్స్ ఇప్పటికే సౌత్‌తో పాటు నార్త్‌ను ఊపేస్తున్నాయి. కరణ్ జోహార్ సైతం ఈ సినిమాతో విజయ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేంత గొప్పగా లైగర్‌ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా నార్త్, సౌత్‌లో కలుపుకుంటే భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.
సినిమా హిట్ అయితే చాలు మన టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే.. అయితే ఇప్పటి వరకు అయిన పాన్ ఇండియా స్టార్లకు.. విజయ్‌కు చిన్న తేడా ఉంది. వాళ్లకు బలమైన నేపథ్యాలు.. సినీ వారసత్వాలు.. భారీ బడ్జెట్ తోడైంది. విజయ్‌కు అవేవి లేకుండా సొంత క్రేజ్‌తో ఈ ఘనత సాధ్యమైంది.