Moviesఆ ఛానల్‌ పై సూపర్ స్టార్ కృష్ణ ఫైర్..ఎవ్వరు ఆపలేరు అంటూ...

ఆ ఛానల్‌ పై సూపర్ స్టార్ కృష్ణ ఫైర్..ఎవ్వరు ఆపలేరు అంటూ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరో గా నటించిన లెటేస్ట్ సినిమా సర్కారువారి పాట. మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరో వైపు వ‌సూళ్ల పరంగా దుమ్ము రేపుతోంది. రెండు రోజుల‌కే రు. 103 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో ను సత్తా చాటుతుంది. అయితే మొదట్లో ఈ సినిమా పై నెగిటివ్ ప్రచారం జరిగింది.

సినిమా బాగోలేదు అని..అట్టర్ ఫ్లాప్ అని..కొన్ని ఛానెల్స్ రివ్యూ ఇచ్చాయి. అయినా సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సినిమాకు భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. అలాగే రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఇలా ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా సర్కారు వారి పాట రికార్డుకెక్కింది.

ఇలాంటి నెగిటివ్ టాక్ పై మహేశ్ పెద్ద గా పట్టించుకోలేదు. కానీ ఆయన అభిమానులు చాలా సీరియస్ గా తీసుకుని..ఫ్లాప్ సినిమా అని రివ్య్యు ఇచ్చిన వాళ్లతోనే సినిమా సూపర్ హిట్ అని రాసేలా చేయించారు. #SVPBLOCKBUSTER అనే హ్యాష్ ట్యాగ్ తో రచ్చ రచ్చ చేసి టాప్ ట్రెండింగ్ లో వచ్చేలా చేశారు. అయితే, సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..మహేశ్ బాబు ని ఓ రేంజ్ లో పొగిడేశారు.

ఆయన మాట్లాడుతూ..” సర్కారు వారి పాట సినిమా చాలా బాగుందని. ఈ సినిమాలో మహేశ్ నటన పోకిరి,దూకుడు సినిమాల్లో కంటే ఇంకా బాగుంది. కానీ, కొన్ని చానెళ్లు మాత్రం రాజకీయ రంగులు పూస్తూ.. సినిమా పై నెగిటీవ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటివి ఏవి జనాలు పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేస్తూ బాక్స్ ఆఫిస్ వద్ద సర్కారువారి పాటను బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చో పెట్టారు.

ఈ సినిమా ఫస్ట్‌ హాప్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. సెకండ్‌ హాఫ్‌లో మహేశ్‌ పర్ఫామెన్స్‌ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీ కలేక్షన్స్‌ అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్‌తో పోతుంది”అంటూ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సర్కారు వారి పాట’ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేసిన ఆ ఛానల్‌కి పరోక్షంగా చురకలేశారు సూపర్ స్టార్ కృష్ణ. రాజకీయ రంగులు పూస్తూ సినిమాని తొక్కేయాలి అనుకున్నా జనాల ప్రేమను ఎవ్వరు ఆపలేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చే శారు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news