టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు రేపు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపుగా రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సర్కారు సినిమ తర్వాత మహేష్ లైనప్‌లో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తోన్న మహేష్.. ఆ తర్వాత రాజమౌళి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మహేష్‌బాబు కోసం ఓ స్టార్ డైరెక్టర్ 20 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు డైరెక్టర్ తన తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఆయన ఎవరో కాదు వి. సముద్ర. 20 ఏళ్ల క్రితం వి. సముద్ర ఓ పాపులర్ డైరెక్టర్. మాస్ సినిమాలు.. కమర్షియల్ సినిమాలు చేయడంలో ఆయన దిట్ట. రాజశేఖర్‌తో సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాకేంటి లాంటి హిట్ సినిమాలు ఆయన తెరకెక్కించారు.
మహేష్‌బాబు ఒక్కడు సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. మహేష్‌కు తిరుగులేని స్టార్డమ్ తెచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమా హిట్ అయ్యాక మహేష్‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది స్టార్ డైరెక్టర్లు వెయిట్ చేశారు. ఈ లిస్టులోనే సముద్ర కూడా ఒకరు. ప్రకాష్‌రాజ్ ద్వారా మహేష్‌బాబును కలిసిన సముద్ర కథ చెప్పడంతో మహేష్‌కు బాగా నచ్చేసిందట.
కంప్లీట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను సముద్ర డిజైన్ చేసుకున్నారట. అయితే ఈ సినిమాకు అప్పటి వరకు సూపర్‌గుడ్ ఫిలింస్ వాళ్లు పెట్టే బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ బడ్జెట్ అవ్వడంతో వాళ్లు బడ్జెట్ విషయంలో వెనక్కు లాగుతున్నారట. అలా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. సముద్ర ఎక్కువుగా సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్లోనే సినిమాలు చేసేవారు.
ఒక్కడు నుంచి నిజం – నాని – పోకిరి – అతిధి – ఖలేజా వరకు మహేష్‌తో ట్రావెల్ అవుతూనే ఆయన ఛాన్స్ ఇవ్వకపోరా ? అని సముద్ర ఎదురు చూస్తూనే ఉన్నాడట. ఆ తర్వాత మహేష్‌కు తనకు గ్యాప్ వచ్చేసిందని.. ఇప్పుడు కూడా ఎక్కడ కనపడినా ఆయన ఏమండి ఆ కథ ఇంకా ఉంది కదా ? అని అడుగుతూనే ఉంటారని సముద్ర చెప్పారు. ఇప్పుడు తాను సక్సెస్‌లో లేనని. ఓ హిట్ కొట్టి మళ్లీ మహేష్‌ను కలిసి సినిమా ట్రై చేస్తానని చెప్పారు.