Moviesతెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ప్ర‌శ్న‌... సూప‌ర్ ట్విస్ట్‌...!

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ప్ర‌శ్న‌… సూప‌ర్ ట్విస్ట్‌…!

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏంటి ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌పై ప్ర‌శ్న రావ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ? ఇది నిజ‌మే.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఓ ప్ర‌శ్న వేశారు. ఈ మ్యాట‌ర్ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటీవలే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తే.. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీముడు పాత్ర‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎన్టీఆర్ త‌న అమోఘ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేశాడు. అయితే కొమురం భీం తెలంగాణ స్వాతంత్య్ర పోరాట యోధుడు.

ఆదిలాబాద్ జిల్లాలోని గోండు జాతికి చెందిన కొమురం భీం నిజాం ర‌జాకార్ల‌పై పోరాటం చేయ‌డంతో పాటు వారి తూటాల‌కు బ‌ల‌య్యాడు. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో అప్ప‌ట్లో స్వాతంత్య్ర పోరాటం ర‌గ‌ల్చ‌డంలో కొమురం భీంది కీల‌క‌పాత్ర‌. ఇప్పుడు ఈ పాత్ర‌కు సంబంధించి తెలంగాణ ఇంట‌ర్ ఇంగ్లీష్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో ఓ ప్ర‌శ్న అడిగారు.

త్రిబుల్ ఆర్ సినిమాలో కొమురం భీంగా న‌టించిన ఎన్టీఆర్‌ను మీరు రిపోర్ట‌ర్‌గా ప్ర‌శ్నిస్తే ఏయే ప్ర‌శ్న‌లు అడుగుతారు ? అన్న‌దే ఈ ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న ఉన్న క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ను ఇప్పుడు తార‌క్ ఫ్యాన్స్ నెట్టింట్లో అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అమోఘ‌మైన న‌ట‌న‌కు నిద‌ర్శ‌నంగానే ఈ క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో ఆయ‌న టాపిక్ ఉంద‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక త్రిబుల్ ఆర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమా అప్‌డేట్ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news