Moviesఆ హీరోతో ఒక్క ఛాన్స్ .. అలా చేయాలని ఉంది..ఓపెన్...

ఆ హీరోతో ఒక్క ఛాన్స్ .. అలా చేయాలని ఉంది..ఓపెన్ గా చెప్పేసిన హాట్ బ్యూటీ..!!

ఒకప్పటి హీరోయిన్స్ కి నేటి కాలం హీరోయిన్స్ కి చాలా తేడా ఉంది. అప్పట్లో సినిమా అవకాశాలు వస్తే చేసేవారు..కానీ ఇప్పుడు తమ అంద చందాలను ఎరగా వేసి..సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అంతేకాదు మాకు ఆ హీరోతో నటించాలని ఉంది అంటూ ఓపెన్ గా నే చెప్పేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హాట్ బ్యూటీస్ అలియా భట్, దీపికా పదుకునే..పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో కలిసి సినిమాల్లో నటించాలని ఉంది అంటూ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ కళ్లు తెలుగు రౌడీ హీరో పై పడ్డాయి.

మాళవిక మోహన్ చేసింది తక్కువ సినిమాలే.. అయినా ప్రేక్షకులల్లో ఆమె క్రేజ్‌ చూస్తే పిచ్చెక్కిపోతుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో నటించిన తర్వాత తెలుగు, తమిళ తెరపై తన వొంపు సొంపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. ఆమె వేసే బికినీ అందాలకు మైమరచిపోతారు. ఓ రేంజ్‌లో అందలు అరబోస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులోకూడా సినిమాలకు సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ప్రభాస్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందట.

ఇదే కనుక నిజం అయితే..అమ్మడు కెరీర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఇవే. అయితే, రీసెంట్ గా అమ్మడు తన మనసులోని మాట బయట పెట్టేఇసంది. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే మాళవిక ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. వారిని ఖుషీ చేసేందుకు అప్పుడప్పుడు లైవ్ సెషన్స్ ద్వారా వారితో ఇంటరాక్ట్ అవుతుంటుంది. తాజాగా అభిమానులతో ముచ్చటిస్తూ..అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ “మీరు ఇప్పటి వరకు తమిళ బిగ్ స్టార్స్ లో రజినీకాంత్, థళపతి విజయ్ తో నటించారు కదా… మీకు ఆ తరువాత ఎవరితో నటించాలని ఉంది “అని అడగ్గా..ఆమె బదులిస్తూ..” విజయ్ దేవరకొండతో రొమాంటిక్ లేదా రోమ్ కామ్ నటించాలని ఉంది”అంటూ తన మనసులోని మాట చెప్పేసింది. దీంతో ఈ బ్యూటీకి విజయ్ అంటే ఎంత ఇష్టమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి విజయ్-మాళవిక కాంబో ఎప్పుడూ సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news