Moviesస‌ర్కారు వారి పాట హిట్... న‌మ్ర‌త స్కెచ్ మామూలుగా లేదుగా...!

స‌ర్కారు వారి పాట హిట్… న‌మ్ర‌త స్కెచ్ మామూలుగా లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన సర్కారువారి పాట. ఈ గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్‌తో కూడా వ‌సూళ్ల దుమ్ము రేపుతోంది. రెండు రోజుల‌కే రు. 103 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో అయితే ఇప్ప‌టికే 1.8 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. మ‌హేష్ ఇమేజ్‌తో టాక్‌తో సంబంధం లేకుండా సినిమాకు భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి.

సినిమా ప‌ర్లేద‌నే చెప్పాలి. అయితే టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి సోష‌ల్ మీడియాలో ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌ర్కారు వారి పాట సినిమాను తొలి ఆట నుంచే డిజాస్ట‌ర్ ఎస్వీపీ టాక్‌తో బాగా వైర‌ల్ చేశారు. చివ‌ర‌కు స‌ర్కారు వారి పాట డిజాస్ట‌ర్ అన్న‌ది ఏకంగా నేష‌న‌ల్ లెవ‌ల్లో ట్రెండ్ అయ్యింది.

అయితే ఇప్ప‌ట్లో పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం… మ‌హేష్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి రెండేళ్లు అవ్వ‌డంతో స‌ర్కారు వారి పాట సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో ఉన్నారు. ఈ టైంలో సినిమాకు మాంచి ప్ర‌మోష‌న్ ప‌డితే వ‌సూళ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ఆ బాధ్య‌త‌ను మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త తీసుకుంది. గ‌తంలో న‌మ్ర‌త మ‌హేష్ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయాల‌నుకుంటే మ‌ల్టీఫ్లెక్స్‌ల్లోనే సినిమాలు చూసేవారు.

ఇప్పుడు మాస్ ఫ‌ల్స్ తెలుసుకోవాల‌నో ఏమోగాని ఆమె మాస్ పీపుల‌త్‌తో సింగిల్ స్క్రీన్ల‌లో సినిమాలు చూస్తున్నారు. రిలీజ్ రోజు కూక‌ట్‌ప‌ల్లిలోని భ్ర‌మ‌రాంబ‌లో బెనిఫిట్ షో చూశారు. కొంద‌రు టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఆ షోకు హాజ‌ర‌య్యారు. సినిమా బాగుంద‌ని వాళ్లు కితాబు ఇవ్వ‌డం కూడా స‌ర్కారు వారి పాట‌కు ఎంతైనా హెల్ఫ్ అయ్యింది.

ఇక తాజాగా న‌మ్ర‌త హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో సినిమా చూశారు. ఆమె వెంట చిత్ర నిర్మాత‌తో పాటు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం కూడా ఉన్నారు. షో అనంత‌రం అక్క‌డే కేక్ క‌టింగ్ కూడా పెట్టారు. న‌మ్ర‌త గ‌తంలో శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల‌ను బాగా ప్ర‌మోట్ చేశారు. అయితే అదంతా క్లాసీగా.. మ‌ల్టీఫ్లెక్స్ రేంజ్‌లో ఉండేది. ఏదేమైనా నిర్మాణ వ్య‌వ‌హారాల‌తో పాటు సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌హేష్‌కు న‌మ్ర‌త చాలా హెల్ఫ్ ఫుల్‌గా ఉంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news