సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ … కాదు డేగల బాబ్జీ… ఉరఫ్ బండ్ల గణేష్. ఇటు సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్… వీరిద్దరి కన్నా బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు నిజంగా గ్రేట్. నిజంగా దగడ్ సాంబతో సంపూర్ణేష్ తాను పై ఇద్దరి హీరోల కన్నా తోపు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. రేపు ఈ ముగ్గురు హీరోలు నటించిన మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. డేగల బాబ్జీగా బండ్ల గణేష్, దగడ్ సాంబగా సంపూర్ణేష్, ఇటు రాజశేఖర్ నటించిన శేఖర్ థియేటర్లలోకి వస్తున్నాయి.
అసలు బడా హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు తీసి.. రాజకీయంగా కూడా రచ్చ చేసే బండ్ల గణేషుడు, ఇటు సీనియర్ హీరో రాజశేఖర్ ఎక్కడ.. ఏదో నాలుగు షార్ట్ ఫిల్మ్‌లు తీసుకుని.. స్ఫూఫ్ కామెడీ సినిమాలు చేసే సంపూర్ణేష్ బాబు ఎక్కడ ? గణేష్ కూడా ఓ కమెడియనే.. అప్పుడప్పుడు కొన్ని కామెడీ క్యారెక్టర్లు వేశాడు. సంపూర్ణేష్ బాబు ఫస్ట్ నుంచి హీరోయే ? బడ్జెట్ తక్కువ… తన సినిమాలకు ఎప్పుడూ భారీ నష్టాలు రావు.
కానీ గణేష్ ఇప్పుడు హీరో అట. అది కూడా సినిమాలో నవరసాలు తనొక్కడే పోషిస్తాడట. మిగిలిన పాత్రల గొంతులు మాత్రమే వినిపిస్తాయట. అది సంగతి. అంటే ఫైట్లు, పాటలు చూసే బాధ ప్రేక్షకుడికి తప్పుదందున్న మాట. వాస్తవానికి ఈ ఇద్దరి సినిమాల్లో ఎవరి సినిమా ఎలా ఉందో రేపు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. అయితే ఎవరి సినిమాకు ఎంత ప్రి రిలీజ్ క్రేజ్ ఉందో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు చెప్పకనే చెప్పేశారు.
బండ్ల గణేష్ అంతటి భారీ చిత్రాల నిర్మాత చేసిన సినిమాకు హైదరాబాద్‌లో దక్కిన థియేటర్లు జస్ట్ నాలుగంటే నాలుగు. అది కూడా ఒక్కొక్క షో మాత్రమే. ఓవరాల్‌గా తెలంగాణ వరకు చూస్తే 11 థియేటర్లు మాత్రమే దక్కాయట. అది బండ్ల గణేష్ సినిమాకు ఉన్న క్రేజ్. హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క రెగ్యులర్ థియేటర్ కూడా ఈ సినిమాకు దక్కలేదు.
అటు సంపూర్ణేష్ దగడ్ సాంబకు హైదరాబాద్ సంథ్య ధియేటర్ సహా 5 రెగ్యులర్ థియేటర్లు ఇచ్చారు. ఇవి కాక 39 మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్, ఇతర థియేటర్లలో కూడా షోలు వేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో మరో 7 థియేటర్లు. అంటే సంపూర్ణేష్‌కు ఓ సెక్షన్ ఫ్యాన్స్ ఉన్నారన్నదే బయ్యర్ల నమ్మకం. ఇక రాజశేఖర్ ముసలి లుక్‌తో నటిస్తోన్న శేఖర్ కూడా ఉన్నా… ఆ సినిమాకు కూడా రాజశేఖర్ గత సినిమాలతో పోలిస్తే అంత క్రేజ్ కనపడడం లేదు.