బాలీవుడ్ ముద్దుగుమ్మలు బాగా పాపులర్ అయ్యేందుకు బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఫస్ట్ సూత్రంగా పెట్టుకున్నట్టు ఉన్నారు. ఎంత బాగా బోల్డ్‌గా స్టేట్మెంట్లు ఇచ్చినా.. ఎంత బోల్డ్‌గా రచ్చ చేసినా అంత ఎక్కువ పాపులారిటీ వస్తుందనే వీరు నమ్ముతున్నారు. ఇక ఎంత బాగా బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తే అంత బోల్డ్ ఆన్సర్లు వస్తున్నాయన్న ఉత్సాహంతో కొన్ని షోల హోస్ట్‌లు కూడా రెచ్చిపోయి మరీ ప్రశ్నలు వేస్తున్నారు.
కాఫీవిత్ కరణ్ – నో పిల్టర్ విత్ నేహా షోలకు కూడా బోల్డ్ ప్రశ్నల షోలు అన్న ఇమేజ్ బాగా సెట్ అయిపోయింది. అయితే ఇలాంటి షోలు కొంతమంది సెలబ్రిటీల జీవితాల్లో సైతం కల్లోలాలు రేపుతున్నాయి. చాలా మంది తమ పడక గది విషయాల నుంచి తమ జీవితంలో ఎఫైర్లు, బ్రేకప్‌ల గురించి కూడా ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఐటం బాంబ్ మలైకా అరోరా శృంగారం గురించి చాలా బోల్డ్‌గా మాట్లాడేసి సంచలనాలు రేపింది. పైగా రతిలో తనకు ఇష్టం అయిన భంగిమ గురించి కూడా ఎంచక్కా వివరించింది.
ఆమె చెప్పిన ఆ భంగిమ.. ఆ విషయం బాగానే హైలెట్ అయ్యింది. అయితే ఆ వీడియో చూసిన వాళ్లలో కొందరు అయినా సిగ్గుపడ్డారేమో గాని.. ఆమె ఏ మాత్రం ఫీల్ అవ్వలేదు. ఇక పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శృంగార తార సన్నీలియోన్. ఆమె శృగారం గురించి పెద్ద క్లాసకే తీసుకుంది. ఇక రాధికా ఆఫ్టే లాంటి వాళ్లు అయితే శృంగారం గురించి మాటల్లో కంటే చేతల్లోనే బాగా చెపుతామన్నంత బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులోనే ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా చేరిపోయారు.
షేప్ ఆఫ్ యు షోలో ఆమె శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. శృంగారం అనేది శరీరానికి మాంచి ఎక్సర్సైజ్ అని చెప్పిన ఆమె… ఎక్కువుగా రిలీఫ్ కావాలన్నా.. ఎక్కువ క్యాలరీలు ఖర్చవ్వాలన్నా కూడా శృంగారం అనేది మాంచి ఎక్సర్సైజ్ అని.. మంచి వర్కవుట్ అని చెప్పింది. కొద్ది నెలల క్రితం తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు తన తల వెంట్రుకలు ఊడిపోయాయని.. అప్పుడు ఉన్న వెంట్రుకలు కూడా ఎందుకని ? మొత్తం క్లీన్‌గా గుండు కూడా గీయించుకున్నానని చెప్పింది.
ఆ గుండు గీయించుకున్నప్పుడు తన ఫేస్‌ను అద్దంలో చూసుకుంటే తాను చాలా అందంగా కనిపించానని కూడా తాహిరా చెప్పింది. ఆ టైంలో తనను తాను ఓ శృంగార కన్యలా భావించాను అని చెప్పుకువచ్చింది. అయితే తాహిరా కూడా మలైకా, సన్నీని మించిన బోల్డ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుందా ? అన్న చర్చలు ఇప్పుడు నెటిజన్లలో నడుస్తున్నాయి.