సీనియర్ హీరో రాజశేఖర్‌కు ఇటీవల వరుసగా అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. రాజశేఖర్ హీరోగా నటించిన తాజా సినిమా శేఖర్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని థియేటర్లలోకి వచ్చిన శేఖర్‌కు అసలే అంతంత మాత్రం టాక్ రాగా… తమ డబ్బులు ఇవ్వలేదని ఫైనాన్షియర్లు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు శేఖర్ సినిమా ప్రదర్శనతో పాటు టీజర్లు, ట్రైలర్లు ఏవీ కూడా ఎక్కడా ప్రదర్శించడానికి వీల్లేదని సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసింది. దీంతో శేఖర్ రెండో రోజు సాయంత్రానికే థియేటర్ల నుంచి మాయమైంది.
డిజిటల్ ప్రొవైడర్లు ఒక్కసారిగా శేఖర్‌ను ప్రదర్శించడం ఆపేశారు. ఇక ఈ సినిమా ఇలా ఉంటే రాజశేఖర్, జీవిత దంపతులు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత సైతం మంచి సినిమాను చంపేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లలో రాజశేఖర్ ఇండస్ట్రీలో తనను కొందరు తొక్కేసేందుకు ప్రయత్నించారి తన బాధ వెళ్లబోసుకున్నారు.
ఒకప్పుడు రాజశేఖర్ సినిమా వచ్చింది అంటే సూపర్ హిట్ అన్న టాక్ ఉండేదని.. రాజశేఖర్ అక్కడమొగుడు లాంటి సినిమాలో ఏడిస్తే.. ప్రేక్షకులు కూడా ఏడ్చారని.. అదే రాజశేఖర్ ఫైట్లు చేస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని.. అదే రాజశేఖర్ సినిమాలు ఇప్పుడు ఎందుకు హిట్ అవ్వట్లేదన్న ప్రశ్నకు రాజశేఖర్ పై విధంగా బదులు ఇచ్చాడు.
ఇండస్ట్రీలో తనను చాలా మంది ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేశారని.. కొందరు హీరోయిన్లను తన పక్కన నటించకుండా కుట్రలు పన్నారని.. అలాగే కొందరు దర్శకులు తనతో సినిమాలు చేయకుండా ప్లాన్లు కూడా వేశారని.. అయితే టాలెంట్‌ను ఒకరు తొక్కాలనుకుంటే జరిగే పనికాదని చెప్పారు. ఇక గబ్బర్‌సింగ్ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేశాడని కూడా రాజశేఖర్ బాంబు పేల్చారు.
పవన్ కళ్యాణ్‌కు తనపై కోపం ఉందని… ఓ కామెడీ సీన్లో పవన్ అందరితో కామెడీ చేయించడంతో పాటు ఆలీ వచ్చినప్పుడు ఏమీ చేస్తిరి ఏమి చేస్తిరి అంటూ తనను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడని రాజశేఖర్ చెప్పాడు. అలాగే ఏంట్రా చూసుకో అంటూ తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా చేయడం కూడా తనకు ఎంతో బాధ కలిగించిందని రాజశేఖర్ చెప్పాడు.
ఇక పవన్ తనను టార్గెట్ చేయడం వెనక కారణం కూడా రాజశేఖర్ చెప్పాడు. ప్రజారాజ్యం పార్టీ టైంలో తాను ఓ టీవీ ఇంటర్వ్యూలో అప్పుడు జరిగిన విషయాలు చెప్పడంతో పాటు ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చిందని.. అది పవన్ మనసులో పెట్టుకునే గబ్బర్‌సింగ్ సినిమాలో తనను ఇమిటేట్ చేశారని రాజశేఖర్ చెప్పారు.