Moviesఅహంకారమైన‌ ప్రేమ‌క‌థ‌.. అదిరిపోయిన చైతు ' థ్యాంక్యూ ' టీజ‌ర్ (...

అహంకారమైన‌ ప్రేమ‌క‌థ‌.. అదిరిపోయిన చైతు ‘ థ్యాంక్యూ ‘ టీజ‌ర్ ( వీడియో)

అక్కినేని నాగ చైతన్య స‌మంత‌తో విడాకుల త‌ర్వాత వ‌రుస పెట్టి హిట్లు కొడుతుండ‌డంతో పాటు కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు. ల‌వ్‌స్టోరీ సినిమాతో హిట్ కొట్టిన చైతు సంక్రాంతికి తండ్రి నాగార్జున‌తో క‌లిసి బంగార్రాజు సినిమాతో మ‌ళ్లీ హిట్ కొట్టాడు. ఈ రెండు హిట్లు చైతుకు కెరీర్ ప‌రంగా మంచి ఊపు ఇచ్చాయి. ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న చైతు అమీర్‌ఖాన్‌తో క‌లిసి ఏకంగా లాల్‌చ‌ద్దా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టులో ప్రేక్షుక‌ల ముందుకు వస్తోంది.

 

ఇక తాజాగా నాగ‌చైత‌న్య దిల్ రాజు బ్యాన‌ర్లో చేసిన సినిమా థ్యాంక్యూ. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. 1.19 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్ ప్రేమ‌క‌థ‌లో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు.. చైతు వ‌ర్సెస్ రాశీఖ‌న్నా మ‌ధ్య ఎలాంటి యుద్ధం జ‌రిగింద‌న్న కోణంలో టీజ‌ర్‌, డైలాగులు ఉన్నాయి. యు బికం సెల్ఫ్ సెంట్రిక్ అండ్ యారోగెంట్ .. నీకు త‌ప్ప నీ లైఫ్ లో వేర‌కొర‌కి చోటే లేదు అని హీరోయిన్‌ చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే వీరిద్ద‌రు ముందు ప్రేమించుకుంటారు. త‌ర్వాత వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది.

జీవితంలో అహంకారం ఉన్న ధనిక వ్యాపారవేత్తగా నాగ చైతన్య క్యారెక్ట‌ర్ ఉంది. అత‌డు ప్రేమ‌లో ప‌డినా కూడా ప్రేమికురాలిని నిర్ల‌క్ష్యం చేయ‌డంతో ముందు ప్రేమికురాలు ఎలాంటి ఇబ్బంది ప‌డింది.. త‌ర్వాత అతడు ఆమె ప్రేమ‌ను కోల్పోయి ఏం తెలుసుకున్నాడు అన్న క‌థాంశంతోనే ఈ సినిమా ఉండ‌బోతోంది. నాగ‌చైత‌న్య కెరీర్‌లో ఎదుగుతున్న‌ప్పుడు వివిధ ద‌శ‌ల‌ను చూపించారు.

సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ మరియు రాశి ఖన్నా వంటి హీరోయిన్లు చైతుకు గ‌ర్ల్ ఫ్రెండ్స్‌గా ఉంటార‌ని తెలుస్తోంది. కాన్సెప్ట్ చాలా బాగుంది మరియు దర్శకుడు విక్రమ్ కుమార్ టీజర్‌తోనే అంచ‌నాలు ఆకాశంలోకి తీసుకు వెళ్లాడు. మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతోందో ? జూలైలో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news