Moviesఒకే టైటిల్‌తో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - మెగాస్టార్ సినిమాలు.. ఏది...

ఒకే టైటిల్‌తో ఎన్టీఆర్ – ఏఎన్నార్ – మెగాస్టార్ సినిమాలు.. ఏది హిట్‌.. ఏది ఫ‌ట్‌…!

టాలీవుడ్‌లో రెండు దశాబ్దాల చరిత్రలో ఒకే టైటిల్‌తో రెండు, మూడు సినిమాలు రావటం జరుగుతూ వస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల‌ టైటిల్స్‌ను ఆయన తనయుడు నటసింహం బాలకృష్ణ కూడా వాడుకొని హిట్లు కొట్టారు. బాలయ్య ఇటీవల కాలంలో నటించిన కథానాయకుడు – జై సింహా టైటిల్స్‌తో గతంలోనే ఎన్టీఆర్ సినిమాలు చేశారు.

 

గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ గ్యాంగ్‌లీడర్ సినిమా టైటిల్ వాడుకొని నేచురల్ స్టార్ నాని కూడా గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టాలీవుడ్లో నిన్నటితరం స్టార్ హీరోలు అయిన దివంగత ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ … సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు కూడా ఒకే టైటిల్ తో సినిమాలు చేశారు.ఆ టైటిల్ ఏదో కాదు ఆరాధన.

ముందుగా ఏఎన్నార్ ఆరాధన విషయానికి వస్తే జగపతి బాబు తండ్రి జగపతి పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి నిర్మాతగా మారారు. ఆయన 1962లో విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం లో నాగేశ్వరరావు – సావిత్రి జంటగా ఆరాధన సినిమా నిర్మించారు. నాగేశ్వరరావు డాక్టర్ గా కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

ఇదే టైటిల్‌తో 1976లో వి.ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ – వాణిశ్రీ జంటగా ఆరాధన సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన నా మది నిన్ను పిలిచింది గానమై.. వేణుగాన‌మై అన్న‌ పాట ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఆరాధ‌న ఆ సంవత్సరం సూపర్ డూపర్ హిట్ అయింది. హనుమంతరావు ఈ సినిమాకు సంగీత సారథ్యం వహించారు. ఎన్టీఆర్ – వాణిశ్రీ జంట ప్రేమ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

ఎన్టీఆర్ ఆరాధన వచ్చిన 11 సంవత్సరాల తర్వాత 1987లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆరాధన సినిమా వచ్చింది. ఈ సంవత్సరం చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో రెండు సినిమాలలో నటించగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పసివాడి ప్రాణం సూపర్ డూపర్ హిట్ అయింది. అదే ఏడాది వచ్చిన ఆరాధన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో రాధిక – సుహాసిని హీరో.. హీరోయిన్లుగా నటించారు.

ఇళయరాజా సంగీతంలో అరే ఏమైంది ఈ వయసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే క్లాసిక్ డైరెక్టర్ భారతీ రాజా తెలుగులో నటించిన చివ‌రి సినిమా. ఆరాధన బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా ఈ మూడు ఆరాధాన‌ల్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్ ఆరాధ‌న‌లు సూప‌ర్ హిట్ అయితే..చిరు ఆరాధ‌న ప్లాప్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news