టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట మూడున్నరేళ్ల పాటు ఎలాంటీ చీకు చింతా లేకుండా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే ఒకటి, రెండు సంఘటనల వల్లే వీరి మధ్య పంతాలు, పట్టింపులు రావడంతో వీరు సడెన్‌గా నిర్ణయం తీసుకుని గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసేసుకున్నారు. విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు. సమంత – చైతు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
అయితే ఇప్పుడు మరో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార పరిస్థితి కూడా సమంత జీవితంలాగానే కాబోతుందా ? అంటే వీరు కూడా తమ పెళ్లి జీవితం కొనసాగించలేక గొడవలతో విడిపోతారని జ్యోతిష్యశాస్త్రం చెపుతోందట. ఈ విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణుడు వేణుస్వామి చెప్పారు. అయిఏ సమంత – చైతు పెళ్లికి ముందే వీరిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పడం… ఇప్పుడు వారు నిజంగానే విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి ఏం చెప్పినా నిజం అవుతుందని నమ్మేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.
వయస్సులో చూస్తే విఘ్నేష్ కన్నా.. నయనతార యేడాది పెద్ద. వీరు కూడా గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి అన్న మాట ఎత్తడం లేదు. పైగా గుళ్లు, గోపురాల చుట్టూ విపరీతంగా తిరుగుతున్నారు. ఎట్టకేలకు జూన్ 9న వీరి పెళ్లి జరగబోతోన్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి, దాంపత్య జీవితంపై వేణుస్వామి సంచలన కామెంట్లు చేశారు. నయనతారకు పెళ్లి కలిసి రాదని.. ఆమెకు గురుడు నీచ స్థితిలో ఉండడంతో వైవాహిక జీవితంలో వెంటనే కలతలు వచ్చి.. గొడవలు జరగడంతో పాటు భర్త నుంచి విడిపోయే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయని చెప్పాడు.
అయితే కొందరు వేణుస్వామిని తప్పుపడుతున్నారు. శుభమా అని ఓ సూపర్ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంటే ఈ అపశకునపు మాటలు ఏంటయ్యా బాబు అని విరుచుకు పడుతున్నారు. మరి కొందరు మాత్రం ఇప్పటికే నయన ముగ్గురు హీరోలతో ప్రేమలో పడింది. అప్పుడు పెళ్లి వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. ఇప్పుడు తనకంటే చిన్నోడు అయిన డైరెక్టర్ విఘ్నేష్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది.
ఈ పరిణామాలకు తోడు గతంలో చైతు – సమంత విషయంలో వేణు స్వాయి చెప్పింది నిజం కావడంతో ఇప్పుడు కూడా అది రిపీట్ అవ్వొచ్చని మరి కొందరు వేణుస్వామికి సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే పెళ్లి అనేది నయనతారకు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్లు రష్మిక, అనుష్కకు కూడా కలిసి రాదని స్వామి చెపుతున్నాడు.