తెలుగు సినిమా రంగంలో ఇన్ని దశాబ్దాల్లో కొన్ని జంటలు ఎప్పటకీ ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ జంటలే. అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ – విజయనిర్మల, కృష్ణ – జయప్రద, కృష్ణ – శ్రీదేవి, ఎన్టీఆర్ – శ్రీదేవి, బాలయ్య – విజయశాంతి, చిరంజీవి – విజయశాంతి ఇలా కొన్ని కాంబినేషన్లకు ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ ఉండేది. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ కృష్ణ – జయప్రద కాంబినేషన్ అంటే నేషనల్ వైడ్‌గా ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారతీయ సినీ చరిత్రలో మరో కాంబినేషన్‌లోనూ రాలేదు.
బ్లాక్ & వైట్ శకంలోనే ఈ జంట కాంబినేషన్లో చాలా సినిమాలు రాగా.. ఆ తర్వాత కలర్ ఫుల్ సినిమాల శకం వచ్చినా కూడా వీరు చాలా సినిమాలు కలిసి చేశారు. ఈ కాంబినేషన్లో మొత్తం 45కు పైగా సినిమాలు వచ్చాయి. 1980వ దశకంలో కృష్ణ – జయప్రద కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల ఉత్సాహం మామూలుగా ఉండేది కాదు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా బాపు దర్శకత్వంలో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మూవీ రాగా అది హిట్ కాలేదు.
ఆ తర్వాత మనవూరి కథ కూడా ప్లాపే.. ఆ తర్వాత ఈనాటి బంధం ఏనాటిదో, దొంగలకు దొంగ, అల్లరి బుల్లోడు, ఊరికి మొనగాడు ఇలా వరుస హిట్లు కొట్టారు. ఓ వైపు బాలయ్య – శ్రీదేవి జోడీకి ఎంత క్రేజ్ ఉన్నా.. జయప్రద – శ్రీదేవి కాంబోకు అంతకు మించిన క్రేజ్ ఉండేది. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి జయప్రద – శ్రీదేవి ఇన్‌డోర్, అవుట్ డోర్ షూటింగ్‌ల నేపథ్యంలో కలిసి మెలిసే ఉండేవారు.
అప్పటికే కృష్ణకు ఇందిర తొలి భార్య కాగా.. విజయనిర్మలతో కూడా పెళ్లయ్యింది. ఎందుకంటే జయప్రదతో ఎక్కువ సినిమాల నేపథ్యంలో కృష్ణ విజయనిర్మల కంటే జయప్రదతోనే ఎక్కువుగా గడపాల్సి వచ్చింది. తనకు కలిసి వస్తోన్న హీరోయిన్ కావడంతో కృష్ణ కూడా ముందుగానే నిర్మాతలకు జయప్రద కాల్షీట్లు బుక్ చేసి ఉంచమని చెప్పేవారట. అలా ఆయన జయప్రదపై ఎక్కడో కాస్త ప్రేమ చూపించేవారు.
జయప్రదను ఎవ్వరూ ఏమన్నా కూడా కృష్ణ ఒప్పుకునే వారు కాదట. ఇది ఎక్కడో విజయనిర్మల, జయప్రద మధ్య ఈగోకు కారణమైందని అంటారు. ఒకానొక సందర్భంలో వీరిద్దరు పక్క పక్కనే ఉన్నా మాట్లాడుకునే వారు కాదట.కనీసం ఒకరి ఫేస్ మరొకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడేవారు కాదట. ఆ తర్వాత ఈ గ్యాప్ క్రమక్రమంగా తగ్గింది.