టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఈ రోజు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. మహేష్‌బాబు కీర్తితో ఇదే ఫస్ట్ టైం జోడీ కట్టడంతో వీరిద్దరి జోడీ కొత్తగా ఫ్రెష్ ఫీల్ తీసుకువస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ రోజు సినిమా చూస్తుంటే ఆ అంచనాలు నూటికి నూరు శాతం నిజం అయ్యాయి. అసలు కీర్తి పక్కన మహేష్ ఎప్పుడో నటించాల్సి ఉన్నా మధ్యలో కియారా అద్వానీ, రష్మిక మందన్న, పూజా హెగ్డే నటించడంతో కీర్తికి ఛాన్స్ కాస్త లేట్‌గా వచ్చింది.
అసలు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని సెట్ చేయాలా ? అన్న చర్చ వచ్చినప్పుడు మహేష్ కూడా కీర్తిని ఓ ఛాయిస్‌గా ఎంపిక చేశారు. మహానటిలో ఆమె నటన చూసి ఫిదా అవ్వని స్టార్ హీరో ఉండడు కదా..!అయితే కీర్తి సురేష్ ఇప్పటి వరకు గ్లామర్‌కు గేట్లు ఎత్తేయలేదు. తన ప్రతి సినిమాలో పద్ధతి, సంప్రదాయాలకు లోబడి ఉన్న పాత్రల్లోనే నటించింది. గ్లామర్, ఎక్స్పోజింగ్ చేసేందుకు ఆమె ఎప్పుడూ తాపత్రయ పడలేదు.
చివరకు ఆమె ఓటీటీలో చేసిన సినిమాల్లో అయినా ఇదే లైన్‌కు కట్టుబడి చేసింది. అయితే సర్కారు వారి పాటలో మాత్రం ఆమె గ్లామర్‌గా కనపించేందుకు తాపత్రయ పడింది. అలాగని ఎక్స్పోజింగ్ విషయంలో ఏం బరితెగించలేదు. గత సినిమాల కంటే కాస్త ఒళ్లు చేసి బబ్లీగా కనపడింది. చూడడానికి ఆమె లుక్ కూడా బాగుంది. ముఖ్యంగా మహేష్ పక్కన చూడచక్కని జంటగా సెట్ అయ్యింది.
కళావతి సాంగ్‌లో ఈ ఇద్దరి జంటను చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇక మమ మహేశా సాంగ్‌లో కూడా ఆమె అందాలు చూపిస్తూ గ్లామర్ బాగానే వలకబోసింది. కొన్ని చోట్ల పాత్రానుసారం చింపిరిజట్టు, మాసిన బట్టలు, వితవుట్ మేకప్‌లోనూ కనిపించింది. రంగ్ దే ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. మరక్కార్తో ఉపయోగం లేదు. ఇలాంటి టైంలో మహేష్ లాంటి పెద్ద హీరో సినిమాలో ఆమెకు బంపర్ ఛాన్స్ వచ్చింద.
దీనిని ఆమె బాగా వాడుకుంది. ఈ క్రమంలోనే బరువు పెరగడంతో పాటు గ్లామర్డోస్ కూడా పెంచేసింది. అలాగే పాటల్లో ఆమె మహేష్ పక్కన వేసిన స్టెప్స్ కూడా అదిరిపోయాయి. ఇక కీర్తి అందాల జాతర ఈ ఫొటోలు చూస్తేనే అర్థమవుతుంది.