రష్మిక మందన్న ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాకుండా.. బాలీవుడ్‌లోనూ ఫుల్ స్వింగ్‌తో దూసుకుపోతోంది. కన్నడంలో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక అక్కడ బిలో యావరేజ్ హీరోయిన్గా మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తన తొలి సినిమా హీరో, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడడం.. చివరకు ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటోన్న టైంలోనే సీన్ రివర్స్ అయిపోయింది.
రష్మికకు తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ఛలో సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా హిట్ అయ్యాక తెలుగు హీరోలు, దర్శకులు వరుస పెట్టి రష్మిక వెంట పడడం స్టార్ట్ చేశారు. బన్నీ పుష్ప, మహేష్ సరిలేరు నీకెవ్వరు, విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం, డియర్ కామ్రేడ్ ఇటు తెలుగులో దున్నేస్తోన్న రష్మిక బాలీవుడ్‌లోనూ క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంది.
ఛలో హిట్ అయ్యి.. వరుస ఆపర్లు రావడంతో రష్మిక ముందు పెళ్లి కంటే కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేసేందుకే మొగ్గు చూపింది. చివరకు దర్శన్‌తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. రష్మిక నుంచి విడిపోయాక రక్షిత్ పూర్తిగా కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నాడు. తన సినిమాలను తెలుగు, కన్నడంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
రక్షిత్ తాజా చిత్రం చార్లీ 777 త్వరలోనే రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో ఓ పుకారు బయలు దేరింది. రక్షిత్.. మరో హీరోయిన్ రమ్యను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నదే ఆ వార్త. ఈ పుకార్లు జోరుగా వైరల్ అవ్వడంతో రక్షిత్ స్నేహితుడు రిషబ్ శెట్టి స్పందించాడు. రక్షిత్ శాండల్‌వుడ్ గోల్డెన్ గర్ల్‌ను పెళ్లాడడం లేదని చెప్పాడు.
దీనిపై స్పందించిన రక్షిత్ ఇవన్నీ పుకార్లు అంటూనే ఆమె తన క్రష్ అని చెప్పడం విశేషం. తన కాలేజ్ రోజుల్లోనే తనపై క్రష్ కలిగి ఉన్నానని చెప్పాడు. అయితే రష్మిక ఉలిదవరు కందంటే నుంచే నా నటన మెచ్చుకుందని.. ఆమె స్వీట్‌గా అనిపించిందని కూడా రక్షిత్ శెట్టి చెప్పాడు. ఆ సినిమా కోసం వాస్తవంగా రక్షిత్ రమ్యను హీరోయిన్గా అడిగినా కథ అర్థం కాకపోవడంతోనే తిరస్కరించిందట. రమ్య తిరిగి సినిమాల్లోకి రావాలని కూడా రక్షిత్ ఆకాంక్షించాడు.