ఆచార్య..మెగాస్టార్ చిరంజీవి హీరో గా ఆయన కొడుకు రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో నటించిన చిత్రమే ఇది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. దారుణంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తప్పు కొరటాల శివ ది అని కొందరు..కాదు కాదు చిరంజీవి కధలో మార్పులు చేయకపోతే సినిమా హిట్ అయ్యుండేది అని మరికొందరు అంటున్నారు. మధ్యలో కి దూరిన సో కాల్డ్ భజన బ్యాచ్..తప్పంతా రాజమౌళి దే అంటూ..రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ వల్లనే ఇలా జరిగింది..సినిమా దొబ్బింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా సినిమా గురంచి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. మనకు తెలిసిందే ఆచార్య సినిమా లో మొదట అనుకున్న హీరోయిన్ త్రిష అని..కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో..ఆ ఆఫర్ ని టాలీవుడ్ చంద మామ కాజల్ కి ఇచ్చారని. కానీ, ఇక్కడ కూడా కొరటాల మాయ చేస్తూ…కాజల్ ని సినిమా నుండి తీసేశారు. అప్పటికే కాజల్ తో కొన్ని సీన్స్ కూడా తెరకెక్కించిన కొరటాల కాజల్ ని తీసేయ్యడం చాలా బాధగా అనిపించింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ని అది సినిమా లో కొన్ని సీన్స్ చేశాక తీసేయడం పెద్ద దుమారమే రేపింది.
అయితే, సినిమాలో కాజల్ నే కాదు.. మిగతా కొంత మంది కమెడియన్స్ ని కూడా కట్ చేశారట. నిజానికి సినిమా లో కామెడీ లేదని చాలా మంది జనాలు అంటున్నారు. కానీ, కాజల్ కాంబినేషన్ లో కొన్ని ఫుల్ ఫన్ సీన్స్ తెరకెక్కించారట. జబర్దస్త్ సత్య, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రలు లాంటి స్టార్ కమెడియన్స్ తో కమెడీ పండించే సీన్స్ షూట్ చేశారట. కానీ సినిమా నుండి కాజల్ ని తప్పించడంతో .. వాళ్ల సీన్లు కట్ చేశారని తెలుస్తుంది.
అంతేకాదు వాళ్ళతో సపరేటు గా మళ్లీ కామెడీ సీన్స్ చేద్దాం అనుకున్న కొరటాల ఐడియాను చిరు ..తప్పు పట్టారట. సినిమా నిడివి ఎక్కువైపోతుంది..పైగా రిస్క్ ఫాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి..అంటూ కొరటాల మనసు మార్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క వేళ కొరటాల కాజల్ ని, కామెడీ సీన్స్ తీయ్యకుండా ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యుండేది అంటున్నారు సినీ విశ్లేషకులు. బ్యాడ్ టైం అంటే ఇదే కాబోలు..!!