Moviesఆ సినిమా చేసి తప్పు చేశా ..తమన్నా సంచలన వ్యాఖ్యలు..!!

ఆ సినిమా చేసి తప్పు చేశా ..తమన్నా సంచలన వ్యాఖ్యలు..!!

మిల్కీ బ్యూటీ తమన్నా..అద్దిరిపోయే ఫిజిక్ తో కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. తమన్నా పేరు కి పరిచయం చేయవలసిన అవసరం లేకుండా .. ఆమె పేరును పాపులర్ చేసుకుంది. అప్పుడెప్పుడో 15 సంవత్సరాల వయస్సు లో “చాంద్ సా రోషన్ చెహ్రా “హిందీ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆ తరువాత సక్సెస్ ఫుల్ “శ్రీ ” (2005 ) మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ..అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. సరే “కేడి “(2006 )మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యింది..అది బెడిసికొట్టింది.

కానీ,ఫైనల్ గా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపి డేస్ సినిమాతో దక్కించుకుంది. ఇక అంతే ఈ సినిమా సక్సెస్ తో ఇప్పటికి హీరోయిన్ గా చేసి..కుర్ర బ్యూటీల అందాలకు చెక్ పెడుతుంది. తమన్నా డ్యాన్స్ ఇరగదీస్తుంది. కానీ ఎందుకు ఆమె సినిమాలో మాత్రల్ ఎక్కువ డ్యాన్స్ చేసే పాత్రలు లేవు. తన నటనతో..టాలెంట్ తో తనదైన స్టైల్లో యాక్ట్ చేసి..కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ఐదేళ్ల కొనసాగిస్తేనే గొప్ప.. అమ్మో అంటుంటారు. ఇక మరి అలాంటిది ఒకటిన్నర దశాబ్ధం నుంచి సినిమాలు చేస్తూనే ఉంటుంది తమన్నా అంటే..ఆమె అందం, నటన ,క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అర్ధం చెసుకోండి. నిజంగా గ్రేట్ అని చెప్పాల్సిందే.

అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన తమన్నా..హీందిలో మాత్రం దెబ్బెసింది. అమ్మడు ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలని అక్కడ అజయ్ దేవ్గన్ హీరోగా హిమ్మత్‌వాలా అనే సినిమా చేసింది. కానీ అమ్మడి దురదృష్టం ఆమెకు బాలీవుడ్‌లో కెరీర్ లేకుండా చేసింది. నిజానికి ఆ సమయంలో తమన్నా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్ లో ఉన్నింది.. ఆ సినిమాపై ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుని ..బాలీవుడ్ కి జంప్ అయ్యింది. కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత అవకాశాలు తగ్గాయి..కానీ తమన్నా టాలెంట్ తో ఎలాగోలా..మళ్లీ తెలుగులో సెటిల్ అయ్యింది. రీసెంట్ గా తాను నటించిన సినిమా ప్రమోషన్స్ లో ఇదే విషయమై ప్రశ్నించగా..ఆ సినిమా చేయకుండా ఉంటే కెరీర్ ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news