నందమూరి నటసింహం తాజాగా నటిస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. కోలీవుడ్ హీరోయిన్ శృతీహాసన్ బాలయ్యకు జోడీగా నటిస్తోంది. అదే కోలీవుడ్ క్రేజీ భామ వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ముసళ్ల మడుగు ప్రతాప్‌రెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
అఖండ తరహాలోనే బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాను కంటిన్యూగా షూట్ చేసి వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అఖండ తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లలో బాక్సులు పగిలిపోయేలా చేసిన థమనే ఈ సినిమాకు కూడా స్వరాలు అందిస్తున్నాడు. క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మలినేనీ గోపి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో అటు డైరెక్షన్ సైడ్ నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా గురించి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఇద్దరు క్రేజీ భామలు శృతీహాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఉండగా.. దర్శకుడు గోపీ మాస్ ఫ్యాన్స్ మెచ్చేందుకు మరో హాట్ ఐటెం భామను దించేశాడు. ఆమెతో అదిరిపోయే మాస్ సాంగ్ సెట్ చేశాడు. ఆమె ఎవరో కాదు డింపుల్ హయతీ. ఈ నల్ల ముద్దుగమ్మతో కుర్ర బాలయ్యకు ఓ ఐటెం సాంగ్ ఉంటుందట.
ఈ సాంగ్ మాస్ జనాలను, బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉండేలా థమన్ తీర్చిదిద్దబోతున్నాడట. ఇక ఈ సినిమా తాజా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఇప్పటి వరకు పూర్తయిన సిరిసిల్ల, హైదరాబాద్ రూరల్ ఏరియా షూటింగ్.. ఇప్పుడు ఫిల్మ్‌సిటీ షూటింగ్ మూడు చోట్లా కూడా దర్శకుడు గోపీ యాక్షన్సీన్లే మెయిన్‌గా షూట్ చేసినట్టు తెలుస్తోంది.