టాలీవుడ్ సినిమాల మార్కెట్‌ను విశ్లేషిస్తే ఆంధ్రా, సీడెడ్ కలిస్తే 65 శాతం వరకు ఉంటుంది. నైజాం మార్కెట్ 35 శాతం వరకు ఉంటుంది. అంటే టాలీవుడ్‌కు మేజర్ ఆంధ్రా ఏరియా నుంచే ఉంటుంది. ఇక నైజాంలో టాలీవుడ్‌కు ఉన్న 35 శాతం మార్కెట్లో సగం మార్కెట్ మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఉంటుంది. హైదరాబాద్‌లోనే ఎక్కువుగా మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి.
దీనికి తోడు వచ్చే సంక్రాంతి నుంచి నగరంలో మరో 20 స్క్రీన్లు యాడ్ అవుతున్నాయి. ఇందులో 11 స్క్రీన్లు ఓడియన్ సెంటర్లో, మరో 11 స్క్రీన్లు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో యాడ్ అవుతున్నాయి. ఇక కొత్త సినిమా… అందులోనూ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అంచనాలు ఎలా ? ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడ్వాన్స్ బుకింగ్‌ల్లో హైదరాబాద్ మార్కెట్ మాంచి స్పీడ్ మీద ఉంటుంది.
హైదరాబాద్‌లో భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో టాప్ – 5 అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదు చేసిన సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
1- త్రిబుల్ ఆర్ :
ఈ యేడాది మార్చి 25న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కలిసి నటించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హైదరాబాద్‌లో అన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దిల్ రాజు ముందుగానే ఫెయిడ్ ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లతో రు 10.5 కోట్లు అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయి.
2- సర్కారు వారి పాట :
మహేష్‌బాబు నటిస్తోన్న తాజా సినిమా సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ నటించిన సినిమా కావడంతో పాటు ప్రి రిలీజ్ బజ్ బాగుండడంతో ఈ సినిమాకు రు 6.60 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లు వచ్చాయి.
3- కేజీయఫ్ 2 :
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీయఫ్ 2 సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. కేజీయఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ 2కు హైదరాబాదులో 6.56 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి.
4- భీమ్లానాయక్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు 6.30 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లో జరిగాయి. ఈ సినిమాకు ఏపీలో ప్రీమియర్లు లేకపోవడంతో చాలా మంది హైదరాబాద్ వెళ్లీ మరీ చూశారు.
5- రాధేశ్యామ్ :
బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రభాస్ నటించిన తాజా పామిస్ట్రీ స్టోరీ రాధేశ్యామ్ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు 6.28 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయి. ఇక టాప్ – 5 అడ్వాన్స్ బుకింగ్‌ల్లో ఉన్న ఈ ఐదు సినిమాలు కూడా ఈ యేడాది రిలీజ్ అయినవే కావడం విశేషం.