టాలీవుడ్లో ఖచ్చితంగా 25 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాకు 25 ఏళ్లు పూర్తయ్యాయి.
1997, మే 9న రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది. ఫ్యాక్షన్ కథల ఒరవడి బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో స్టార్ట్ అయ్యిందని చాలా మంది అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే ముందే ప్రేమించుకుందాం రా సినిమాలో లైట్‌గా ఫ్యాక్షన్ స్టోరీకి ప్రేమ కథ యాడ్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు దర్శకుడు జయంత్.
అప్పటికే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన జయంత్ ప్రేమించుకుందాం రా సినిమాతో దర్శకుడు అయ్యాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు సురేష్‌బాబు జయంత్‌ను తీసుకుని వెళ్లి తిరుపతి దర్శనం చేసుకుని మరుసటి రోజు ఉదయం విజయవాడకు వచ్చారట. ఓ థియేటర్లో మార్నింగ్ షో చూస్తుండగా ఫస్టాఫ్ అయ్యే సరికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ లేదట.
అయితే అంతకు ముందు వరకు టెన్షన్‌గా ఉన్న సురేష్‌బాబు కూల్‌గా ఉన్నాడట. దీంతో జయంత్‌కు కాస్త ధైర్యం వచ్చిందట. చివరకు సెకండాఫ్ చూస్తున్న ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడంతో పాటు క్లైమాక్స్‌లో కేకలు పెట్టడంతో జయంత్‌కు ధైర్యం వచ్చిందట. అయితే ఈ సినిమాకు ముందుగా మరో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారట.
వెంకీ హీరోగా ఫుల్ గోల గోలతో ఉండే స్క్రిఫ్ట్ అట అది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. లవ్ స్టోరీకి చిన్న క్రైం ఎలిమెంట్ యాడ్ చేసి ఉంటుందట. సినిమాలో ఉండే ముగ్గురు హీరోయిన్లుగా సౌందర్య – మాలా శ్రీ – వాణీ విశ్వనాథ్‌ను తీసుకున్నారట. మాలాశ్రీతో పాటు కొందరు కమెడియన్లపై పది రోజులు షూటింగ్ కూడా చేశారట. అయితే ఈ కథలో ప్రేమకథను బలవంతంగా ఇరికించినట్టు వాళ్లకు అర్థమైందట.
చివరకు సురేష్‌బాబు – జయంత కూర్చుని ఈ కథ వర్కవుట్ కాదని ఆపేశారట. ఆ తర్వాత దీన్‌రాజ్ రాసిన కథతో ఈ ప్రేమించుకుందాం రా సినిమా తీశారట. పరుచూరి సోదరులు, అసిస్టెంట్లుగా పనిచేసిన వీఎన్. ఆదిత్య – కాశీ విశ్వనాథ్ – చంద్రమహేష్ వీళ్లంతా కూర్చుని నాలుగు నెలల పాటు కసరత్తులు చేశామని.. రాయలసీమ ఫ్యాక్షన్‌కు ప్రేమకథ జోడించామని జయంత్ తెలిపాడు.