ఏ.అర్ రెహ్మాన్ ..పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం సంగీత దర్శకుడే కాదు స్వరకర్త ,గాయకుడు, గీత రచయిత మరియు నిర్మాత. చిన్న వయసులో కీ బోర్డ్ ప్లేయర్ గా సినీ పరిశ్రమలో కెరీర్ ను ప్రారంభించి… ఇప్పుడు ప్రపంచ సంగీత సామ్రాజాన్ని ఏలుతున్నాడు స్వర చక్రవర్తి ఏ ఆర్ రెహమాన్. గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. రెహ్మాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ మరియు రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడిగా గా కూడా పేరు పొందాడు. అలా అంచలంచలుగా ఎదిగి నేదు సంగీత సామ్రాజ్యాని ఏలుతున్నారు.
కాగా, ఆయన తన కుమార్తె ఖతీజా రెహమాన్ వివాహం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అభిమానులతో నిత్యం టచ్ లో ఉండే రెహ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ ని పంచుకున్నారు. ఇక ఖతీజా రెహమాన్ కూడా తన పెళ్లి సంబంధించిన పిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు. అంటే ఎంత పేరు ఉంది.. జనాల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. మరి ఆయనకు అల్లుడు అవుతున్నాడు అంటే.. ఈయన పెద్ద సౌండ్ పార్టీనే అయ్యుండాలి. ఖతీజా భర్త మామూలోడు కాదండోయ్. బాగా రిచ్.
రియాస్దీన్ రియాన్ ఆడియో ఇంజనీర్, అంతే కాదండోయ్ ఎంట్రప్రెన్యూరర్ కూడా. రియాస్ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త. అతను Apple iTunes, MFiT సర్టిఫైడ్ సౌండ్ ఇంజనీర్. ప్రస్తుతం ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడు. ఇక ఖతీజా విషయానికి వస్తే ఆమెకు కూడా తండ్రి బాటలోనే సాగుతున్నారు. సూపర్ డూపర్ హిట్ అయిన ‘మీమి’ చిత్రంలోని రాక్ ఏ బై బేబీ అనే పాటను పాదింది ఖతీజానే.తండ్రి స్వరపరిచిన ‘రాక్ ఎ బై బేబీ’ పాటను ఆమె పాది అభిమానులను మెప్పిచింది.
ఏఆర్ రెహమాన్ తన కుమార్తె వివాహం సందర్భంగా తిగిన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసుకున్నారు. నూతన వధువరులు ఖతీజా రెహమాన్, రియాస్ధీన్ షేక్ మొహమ్మద్ ముందు కూర్చొని ఉంటే వెనుక రెహమాన్ ఆయన సతీమణి సైబాబాను, మరో కుమార్తె రహీమా , కుమారుడు అమీన్ వెనుక నిల్చుకున్నారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారి యమ ట్రెండింగ్ గా నిలిచాయి.