నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎప్పటి నుంచో అదిగోఇదిగో అంటున్నారే తప్పా ఇప్పటకీ ఎంట్రీ అన్న మాటే లేదు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో శాతకర్ణి తనయుడు పులోమావీ క్యారెక్టర్‌తో మోక్షు ఎంట్రీ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అది జరగలేదు. ఆ తర్వాత పలువురు దర్శకులు మోక్షు డెబ్యూ మూవీ రేసులో వినిపించాయి. పూరి జగన్నాథ్ మోక్షు డెబ్యూ మూవీ డైరెక్టర్ అని అందరూ అనుకున్నారు. పూరి పేరు సైడ్‌కు వెళ్లిపోయింది. అఖండ హిట్ అయ్యాక బోయపాటి శ్రీను పేరు కూడా తెరమీదకు వచ్చింది. ఇక ఇప్పుడు వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసిన అనిల్ రావిపూడి పేరు మోక్షు డెబ్యూ మూవీ రేసులో వినిపిస్తోంది.
బాలయ్య సైతం మోక్షు డెబ్యూ ప్లాన్స్ భారీగా ఉంటాయని చెప్పాడు. ఇక తాజాగా మోక్షు డెబ్యూ మూవీ కోసం అనిల్ రావిపూడి పేరు ఫైనలైజ్ చేసినట్టు టాక్ ? ప్రస్తుతం ఎఫ్ 3 హిట్‌ను ఎంజాయ్ చేస్తోన్న అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు కుమార్తె యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మోక్షు సినిమాయే అనిల్ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.
పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. అసలు పటాస్ నుంచి ఎఫ్ 3 వరకు అనిల్‌కు పరాజయం అన్నదే లేదు. అనిల్ సినిమాల్లో అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటున్నాయి. అటు కామెడీతో పాటు ఇటు యాక్షన్.. కంప్లీట్ కమర్షియల్ ప్యాక్డ్ స్టోరీగానే ఉంటోంది. అనిల్ సినిమా అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.
అందుకే ఇప్పుడు బాలయ్య సైతం అనిల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 పేరుతో సినిమా అనుకున్నారు. అందులోనే మోక్షు ఉంటాడని అనుకున్నారు. అది సెట్ కాలేదు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడికే మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యత దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది.