Moviesపెళ్లికి ముందు సురేఖ ఆ సినిమా చూసే చిరును ఇష్ట‌ప‌డిందా...!

పెళ్లికి ముందు సురేఖ ఆ సినిమా చూసే చిరును ఇష్ట‌ప‌డిందా…!

తెలుగు సినిమా రంగంలో గత ఆరు దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వెళుతున్నారు. ఎన్నో సినిమాలు తీస్తున్నారు. అయితే తెలుగు సినిమాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై సంవత్సరాల పాటు నెంబర్ వన్ పొజిషన్ ఉంటూ శాసించటం అంటే మామూలు విషయం కాదు.
దివంగత లెజెండ్రీ హీరోలు ఎన్టీఆర్… ఏఎన్నార్ తర్వాత 1980వ దశకంలో కుర్రాళ్ళ గుండెలు కుమ్మేస్తూ దూసుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డ చిరంజీవి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో తిరుగులేని మెగాస్టార్ గా మారిపోయాడు.

నాటి నుంచి తాజా సినిమా ఆచార్య వరకు చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో పదేళ్ళపాటు సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి వచ్చి కూడా రు. 100 కోట్ల షేర్ సినిమాలు చేయడం చిరంజీవికే చెల్లింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ… ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీగా డ్యాన్స్ లు వేయడం చిరంజీవికే సాధ్యం అని చెప్పాలి.

 

1978లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్ పునాదిరాళ్లు సినిమాతో తన సినిమా కెరీర్ కు పునాది వేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడంలో ఆలస్యం కావడంతో చిరంజీవి ప్రాణం ఖరీదులో నటించారు. దీంతో ప్రాణం ఖరీదు ముందుగా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల తర్వాత కళా దర్శకుడు బాపు దర్శకత్వంలో మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవి నటించారు. 1978లో మన ఊరి పాండవులు సినిమా రిలీజ్ అయింది.

ఈ సినిమాలో కృష్ణంరాజు – మురళీమోహన్ – చిరంజీవి – ప్రసాద్ బాబు – భానుచందర్ ప్రధాన నటులుగా నటించారు. గ్రామ పెద్ద అయిన రావుగోపాలరావు అరాచకాలను ఎదిరించే వారీగా ఈ ఐదుగురు యువకులు కనిపించారు. ఈ సినిమాలోని తొలిసారిగా అల్లు రామలింగయ్య – చిరంజీవి కలిసి నటించారు.
ఈ సినిమాలో పల్లెటూరి లో ఉండే చిరంజీవి చాలా సీన్ల‌లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ సినిమాను తన తల్లిదండ్రులతో కలిసి సురేఖ చూశారట.

సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న ఈ కుర్రాడు ఎవరో కానీ భలే ఉన్నారు అని తల్లిదండ్రులతో తరచూ అనేవారట సురేఖ. విచిత్రమేంటంటే ఆతర్వాత రెండు సంవత్సరాలకే మెగాస్టార్ చిరంజీవితో సురేఖకు పెళ్ళి జరిగింది. ఇటీవల చిరంజీవి – చెర్రీ కలిసి నటించాలని సురేఖ అనుకోగా వెంటనే ఆ కోరిక ఆచార్య సినిమాతో తీరిపోయింది అని చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news