ఎన్నో అంచనాలతో వచ్చిన మెగాస్టార్ ఆచార్య సినిమా మొత్తానికి డిజాస్టర్ అయిపోయింది. చిరుది ఒకటి రెందు కాదు ఏకంగా 150 సినిమాల అనుభవం. చిరు కెరీర్‌లో ఎక్కువ శాతం విజయాలే ఉన్నాయి. చిరుకు ఓ జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆచార్య విషయంలోనూ సినిమా రిజల్ట్ ఏంటో ఆయనకు ముందే అర్థమైపోయిందట. ఇండస్ట్రీలో ఆచార్య షూటింగ్‌లో పాల్గొన్న కొందరు వ్యక్తుల నుంచి విశ్వసనీయ సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే ఇస్తోన్న ఆర్టికల్ ఇది.
పలుసార్లు ఆయన కొన్ని సీన్ల విషమంలో లాజిక్‌ల గురించి దర్శకుడు కొరటాల శివను ప్రశ్నించడంతో పాటు మనం ఎక్కడో తేడా చేస్తున్నాం కదా ? అని అడిగేవారట. అంటే చిరంజీవికి కథలో మార్పులు, కొరటాల టేకింగ్ పట్ల ఎక్కడో తేడా కొట్టేసింది. కొరటాల లేదు సార్ మనం అంతా కరెక్టుగానే వెళుతున్నాం.. ఇది ఇప్పుడు జనరేషన్ అని చెప్పేవారట. అక్కడితో ఆగని కొరటాల చిరంజీవి గారు ప్రతి దానికి డౌట్లు పెడుతున్నారని పక్కనే ఉన్న వాళ్లతోనే అనేవారన్న టాక్ కూడా బయటకు వచ్చింది.
చివరకు నిర్మాత నిరంజన్ రెడ్డి రామ్‌చరణ్‌తో నాన్న ఆయన మీద వదిలి పెట్టేద్దాం.. ఆయన ఎలా చెపితే అలానే చేద్దామని అనడంతో రామ్‌చరణ్ కూడా చిరంజీవిని కన్విన్స్ చేసి చాలా బ్యాలెన్సింగ్‌తో షూటింగ్ పూర్తి చేయించారట. అలాగే కొరటాల ముందు రు. 100 కోట్లు ఇవ్వండి… ఈ బడ్జెట్‌లోనే సినిమా అంతా చేసి పెడతానని నిర్మాత నిరంజన్ రెడ్డితో అన్నట్టు తెలుస్తోంది.
చివరకు కరోనా దెబ్బతో వడ్డీలే రు. 50 కోట్లు పెరిగిపోవడంతో కొరటాల ఈ టెన్షన్‌లో ఉండి.. అటు కథ, కథనాలపై పూర్తిగా దృష్టి సారించలేదని అంటున్నారు. చివరకు కొరటాలే రాజమౌళిలా అన్ని ఏరియాలకు బిజినెస్ డీటైల్స్ మాట్లాడేసుకోవడం.. ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా తాము ముందు అనుకున్న అమౌంట్ కట్టలేమని చెప్పడంతో చివరకు రిలీజ్‌కు ముందు రోజు చిరు తన రెమ్యునరేషన్ కూడా రు. 10 కోట్లు వదులుకుని మరీ ముందు సినిమా రిలీజ్ చేయమని చెప్పారట.
కొరటాలకు గత కొన్ని సినిమాలు.. ముఖ్యంగా శ్రీమంతుడు సినిమా నుంచి బిజినెస్‌లో కూడా వేలు పెట్టేయడం మామూలు అయిపోయిందన్న టాక్ ఉంది. దర్శకుడి బాధ్యత ముందు సినిమా నీట్‌గా తీయడం.. అంటే రాజమౌళి కూడా బిజినెస్ చేసుకుంటాడు కదా ? అన్న ప్రశ్నలు వేసే వారు ఉన్నారు. రాజమౌళి సినిమాల రేంజ్ వేరు.. ఆ క్రేజ్ వేరు.. కొరటాల కూడా మరో రాజమౌళి అవతారం ఎత్తేయాలన్న ఆతృతతో బొక్క బోర్లాపడ్డాడు.
ఇక రిలీజ్ అయ్యాక కూడా చిరంజీవి ముందు నుంచి అనుకున్నట్టే రిజల్ట్ తేడా కొట్టేసింది. రామ్‌చరణ్ రోల్‌ను ప్లానింగ్ లేకుండా పెంచేయడం, సినిమాకు పని చేస్తోన్న కొందరు చరణ్ – చిరు కలిసి డ్యాన్స్ చేస్తే కదా ? ప్రేక్షకులు చూస్తారు ? అని చెప్పడంతో మళ్లీ వీరి కాంబోలో పాటలు కలపడం.. ముందుగా అనుకున్న కాజల్ రోల్ తీసేయడం.. ఇలా కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా ఆచార్య ప్లాప్‌నకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రిజల్ట్ చిరు ఊహించిందే అంటున్నారు.