పాపం బాలీవుడ్‌కు గత కొన్నేళ్లుగా వరుసగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఓ వైపు సౌత్ సినిమాలు దేశాన్నే ఊపేస్తూ పాన్ ఇండియన్ సినిమా అనే పదానికి నిర్వచనాలుగా మారుతున్నాయి. ఐదారేళ్లుగా సౌత్ సినిమాల డామినేషన్ బాలీవుడ్‌పై బలంగా ఉంది. అసలు బాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలు రావడం లేదు. బాలీవుడ్ వాళ్ల ఆలోచనలను మన సౌత్ .. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా డైరెక్టర్ల ఆలోచనలో ఎప్పుడో డామినేట్ చేసి పడేశాయి.
ఇక సౌత్‌లో హిట్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ కొని బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్టు కొట్టడం కూడా అక్కడ వాళ్లకు చేత కావడం లేదు. కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ హిట్ మూవీ జిగర్తండా హిందీ రీమేక్ డిజాస్టర్ అయ్యింది. సౌత్ వెర్షన్‌కు చాలా మార్పులు చేసి హిందీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో రీమేక్‌గా ఆ సినిమా తెరకెక్కినా ప్లాప్ అయ్యింది.
ఇక తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది జెర్సీ సినిమా. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డిని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్‌కు జెర్సీ పెద్ద చేదు అనుభవమే మిగిల్చింది. ఎంత దారుణం అంటే అర్జున్‌రెడ్డితో సింపుల్‌గానే రు. 300 కోట్ల హీరో అయిన షాహిద్ జెర్సీ సినిమా కేవలం రు. 30 కోట్లు కూడా రాబట్టుకోలేకపోయింది.
ఇక జెర్సీ సినిమా హిట్ అయ్యాక గౌతమ్ తిన్ననూరితో ఎలాగైనా ఓ సినిమా చేయాలని రామ్‌చరణ్ పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల త్రిబుల్ ఆర్‌తో హిట్ కొట్టిన చరణ్‌కు తాజాగా వచ్చిన ఆచార్య రూపంలో పెద్ద నిరాశే ఎదురైంది. ఆచార్య చరణ్ కెరీర్‌లోనే డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక గత యేడాదిన్నర కాలంగా గౌతమ్‌తో సినిమా కోసం చెర్రీ ట్రావెల్ అవుతూ వస్తున్నాడు.
ఇప్పుడు హిందీ జెర్సీ ప్లాప్ అవ్వడంతో చెర్రీ రిస్క్ చేయలేక గౌతమ్ తిన్ననూరికి గుడ్ బై చెప్పేశాడనే అంటున్నారు. ప్రస్తుతం చెర్రీ తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న 15వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్లో వస్తోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏదేమైనా నిన్నటి వరకు వార్తల్లో ఉన్న చెర్రీ – గౌతమ్ సినిమా చరిత్ర కాల గర్భంలో కలిసిపోయినట్టే..!